Moviesఆ తెలుగు హీరోతో మరో సినిమా..సాయి పల్లవి డెసీషన్ పై ఫ్యాన్స్...

ఆ తెలుగు హీరోతో మరో సినిమా..సాయి పల్లవి డెసీషన్ పై ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిట్టి పొట్టి మిడ్డీలు వేసి బికినీలు వేసి కుర్రాళ్లను టెంప్ట్ చేసే హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో పద్ధతిగా చీర .. చుడిదార్ కట్టుకొని మరి అవార్డులు అందుకుంటుంది అంటే అమ్మడు కాన్ఫిడెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

కాగా సాయి పల్లవి సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది . ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది . అయితే రీసెంట్గా సాయి పల్లవి తెలుగులో చాలా టైం తర్వాత మరో తెలుగు సినిమాని ఓకే చేసింది. ఆ సినిమా మరేదో కాదు నాగచైతన్య హీరోగా నటిస్తున్న చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ . ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా సాయి పల్లవి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో రెండవ హీరోయిన్గా కీర్తి సురేష్ కూడా ఫిక్స్ అయిపోయిందట .

కీర్తి సురేష్ నాగచైతన్య కాంబోలో ఇది ఫస్ట్ సినిమా అయినా సాయి పల్లవి – నాగచైతన్య కాంబోలో మాత్రం ఇది సెకండ్ సినిమా .. అందుకే ఈ హిట్ పెయిర్ పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు అభిమానులు . సాధారణంగా హీరోస్ ని రిపీట్ చేయని సాయి పల్లవి నాగచైతన్య విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంది ..చూద్దాం మరి ఏం జరుగుతుందో .. ఈ సినిమా ద్వారా ఆమె ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news