Movies"ఎవ్వడు దేకడు"..రైతు బిడ్డ పై మాధవిలత సంచలన కామెంట్స్..!!

“ఎవ్వడు దేకడు”..రైతు బిడ్డ పై మాధవిలత సంచలన కామెంట్స్..!!

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఎన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ దక్కించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ షోని బూతులు తిట్టే జనాలు ఎంతమంది ఉన్నారో.. అదే రేంజ్ లో ఆదరించే జనాలు కూడా ఉన్నారు. కొందరు ఈ షో ద్వారా సక్సెస్ అయితే మరికొందరు లైఫ్ పోగొట్టుకున్నారు .అలాంటి లిస్టు చాలా పెద్దదే ఉంది. అయితే రీసెంట్ గా ఈ షో లో ఉన్న కంటెస్టెంట్స్ పై బయట ఎలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయో మనం బాగానే విన్నాం చూసాం . ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ మాధవి లత ను ఓ నెటిజన్ మీరు బిగ్బాస్ చూస్తున్నారా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు . దీంతో ఆమె ఫుల్ ఫైర్ అయిపోయి ఘాటుగా రిప్లై ఇచ్చింది .

“బిగ్ బాస్ అనేది ఒక కమర్షియల్ షో.. ఇది మొత్తం డబ్బు మీదే రన్ అవుతుంది . ఇందులో సామాన్య జనాలకు ఛాన్స్ అనేది చాలా సుత్తి .. సామాన్య జనాలు పెడితే ఎవరు దేకడు . అందుకే వాళ్ళకి ఎవరిని కావాలో వాళ్లే పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళను పెట్టుకుంటేనే అందరు దేకతారు.. అంతేకాదు ఈసారి సీజన్ కి చాలామంది స్టార్ సెలబ్రిటీస్ వద్దకు ఆఫర్స్ తీసుకెళ్లిన నువ్వు వద్దు నీ డబ్బు వద్దు ..నీకు దండం రా బాబోయ్ మా ఇజత్ ముఖం అంటూ చాలా మంది హ్యాండ్ ఇచ్చారు “.

“నన్ను బలవంతం చేయద్దు దేకేవాళ్లు దేకండి” అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చింది . అయితే పరోక్షంగా మాధవి లత రైతు బిడ్డను ఉద్దేశిస్తూ మాట్లాడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. ఒక రైతు బిడ్డ అని చెప్పి ఒక వ్యక్తిని లోపలికి పంపిస్తే జనాలు లైక్ చేయరని .. అదే ఓ టాప్ సెలబ్రిటీని పంపిస్తే మాత్రం జనాలు ఎగబడి చూస్తారని పరోక్షకంగా చెప్పగానే చెప్పేసింది మాధవి లత అంటూ కామెంట్స్ చేస్తున్నారు…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news