Moviesర‌ష్మీ వ‌ల్లే ఇదంతా… ఆ సీక్రెట్ చెప్పిన సుధీర్‌…!

ర‌ష్మీ వ‌ల్లే ఇదంతా… ఆ సీక్రెట్ చెప్పిన సుధీర్‌…!

జబర్దస్త్ షోలో బుల్లితెర కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ కడుపుబ్బ నవ్విస్తాడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై సుడిగాలి సుధీర్ – రష్మీ జంటకు ఎలాంటి క్రేజ్ ? ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ సాఫ్ట్‌వేర్ సుధీర్ – గాలోడు – త్రీ మంకీస్ లాంటి సినిమాలతో నటించి వెండితెర ప్రేక్షకులను కూడా అలరించారు.

ఇక రష్మీతో సుధీర్ కెమిస్ట్రీ గురించి చెప్పక్కర్లేదు. అసలు నిజంగా వీరిద్దరూ లవర్స్ కాదు తెలియదు కానీ.. వీరిద్దరు బుల్లితెరపై కనిపిస్తే ఆడియన్స్ కు మాత్రం పండగే పండగ. తాజాగా సుధీర్ – రష్మీ ఓ ప్ర‌ముఖ‌ ఛానల్ కు చెందిన వార్షికోత్సవ వేడుకకు హాజరయ్యారు. అందులో వీరిద్దరి ఓల్డ్ వీడియోలను ప్రదర్శించడంతో వీరు చాలా ఎమోషనల్ అయ్యారు.

ఈ వీడియోలో సుధీర్ మాట్లాడుతూ రష్మితో నాది బ్యూటిఫుల్ జర్నీ.. బేసిక్ గా తాను కష్టపడే మనస్తత్వం కలిగిన అమ్మాయి.. నాకు అందరికంటే రష్మినే ఎక్కువ.. నిజం చెప్పాలంటే నా సక్సెస్ కు ముఖ్య కారణం కూడా ఆమెని అంటూ సుధీర్ కాస్త ఎమోషనల్ గా మాట్లాడాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా అందరూ ఎమోషనల్ అయ్యారు.

అయితే ఆటో రాంప్రసాద్ – గెటప్ శ్రీను .. సుధీర్ సక్సెస్ కు కారణం. వీరు ముగ్గురు కలిసి చేసిన స్కిట్స్ ప్రతిసారి హైలెట్ అయ్యాయి. అలాంటిది వీరిని కాద‌ని సుధీర్ కేవ‌లం ర‌ష్మీనే ఆకాశానికి ఎత్తేశాడంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news