Moviesఫుల్ జోష్ మీద ఉన్న ఎన్టీఆర్…హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఏం...

ఫుల్ జోష్ మీద ఉన్న ఎన్టీఆర్…హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఏం చేసారో చూడండి(వీడియో)..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గానే దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే . సైమా అవార్డ్స్ లో పాల్గొనడానికి ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లారు . సెప్టెంబర్ 15 , 16 తేదీల్లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు . ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గాను ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.

ఈ అవార్డు కోసం రామ్ చరణ్ – నిఖిల్ – దుల్కర్ సల్మాన్ – సిద్దు జొన్నలగడ్డ కాంపిటీషన్ ఇవ్వగా ఫైనల్లీ కొమరం భీం గా అద్భుత పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ సైమా అవార్డును అందుకున్నాడు . రీసెంట్ గానే ఎన్టీఆర్ దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు . హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన దిగిన విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . అంతేకాదు ఎప్పుడు లేని విధంగా తారక్ ఈసారి ఫుల్ జోష్ మీద కనిపించడం అభిమానులకు ఆశ్చర్యకరంగా అనిపించింది .

జనరల్ గా తారక్ బయట ఎక్కువగా మీడియాకి ఫోటోకి ఫోజులు ఇవ్వడు . కానీ ఈసారి చాలా జోవియల్ గా ఉన్నాడు. సరదాగా మీడియా రిపోర్టర్ కు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు. ఎన్టీఆర్ మీడియాకు అభివాదం తెలిపి అక్కడ నుంచి ముందుకెళ్లారు. దీంతో ఎన్టీఆర్ స్పెషల్ జోష్ మీద ఉన్నాడని లేటెస్ట్ విజువల్స్ ఆధారంగా తెలిసిపోతుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news