Movies"ఎవ్వరు ఏమైన అనుకోండి..ప్రభాస్ కి అస్సలు అది లేదు".. జగపతి బాబు...

“ఎవ్వరు ఏమైన అనుకోండి..ప్రభాస్ కి అస్సలు అది లేదు”.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న జగపతిబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. ఇప్పుడంటే విలన్ పాత్రలు పోషిస్తున్నారు కానీ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాలు లో నటించాలి అంటే అందరు జగపతిబాబు ఇంటికే వెళ్లేవారు.. అంతలా తన నటనతో ఫామిలీ లేడీస్ ని సైతం థియేటర్స్ కి రప్పించేవాడు జగపతిబాబు . కాగా రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ తన రిలేటివ్ అయిన రాజమౌళి గురించి సంచలన కామెంట్స్ చేశారు . అంతేకాదు రెబల్ హీరో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఓ రేంజ్ లో పొగిడేసారు . ప్రెసెంట్ ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది .

జగపతిబాబు మాట్లాడుతూ..” రాజమౌళి కుటుంబం చాలా విభిన్నంగా ఉంటుంది . అస్సలు డబ్బున్న వాళ్ళలా ప్రవర్తించరు . సాదాసీదా మనుషులు ఇలానే ఉంటారు ఎన్ని అవార్డులు వచ్చినా సరే ఆ కుటుంబం కి అస్సలు గర్వం ఉండదు. అందుకే నాకు చాలా చాలా ఇష్టం . రాజమౌళికి నేను బంధువైన సరే ఏనాడు నాకు అవకాశం ఇవ్వు అని నేను అడగలేదు.. ఈ సినిమా పాత్ర చేయి అని ఆయన అడగలేదు ఆ పాత్రకి ఎవరు బాగా నటిస్తారో ఆయనకి బాగా తెలుసు. అలాంటి వాళ్ళనే చూస్ చేసుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు “.

అంతేకాదు ప్రభాస్ గురించి మాట్లాడుతూ ..”ఓసారి డిప్రెషన్ లో ఉన్నప్పుడు నాకు చాలా చాలా బాధేసింది ..ఆ టైంలో ఎవరికి కాల్ చేయాలో తెలీక ప్రభాస్ కి కాల్ చేశాను .. అప్పుడు ఆయన ఇండియాలో లేరు జార్జియాలో ఉన్నాడు . అక్కడ నుంచి నాతో ఫోన్లో మాట్లాడాడు . డార్లింగ్ మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి.. నేను సాల్వ్ చేస్తాను అంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించారు. ఇండియా వచ్చిన వెంటనే నన్ను కలిశాడు. అంతేకాదు నాకు ఎంతో మేలు చేశాడు. వయసులో చిన్నవాడైనా గొప్ప మనసు కలిగిన వాడు . ప్రభాస్ కి ఇవ్వడం తప్పిస్తే తిరిగి తీసుకోవడం తెలీదు ఎవ్వరు సహాయం అడిగినా సరే కాదు లేదు అనకుండా చేస్తాడు “అంటూ జగపతిబాబు ప్రభాస్ లోని మంచితనాన్ని అభిమానులకు తెలియజేశారు..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news