Moviesబిగ్ అనౌన్స్మెంట్: మరో సినిమాని ప్రకటించిన రాజమౌళి.. అభిమానులకు ఊహించని షాక్...

బిగ్ అనౌన్స్మెంట్: మరో సినిమాని ప్రకటించిన రాజమౌళి.. అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన జక్కన్న..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోకి మించిన స్టేటస్ అందుకుని సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ గా వైరల్ అవుతున్న దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్ దర్శకధీరుడుగా ట్యాగ్ చేయించుకొని మరి సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రాజమౌళి .. మహేష్ బాబుతో కలిసి ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీగా ఉన్న విషయం తెలిసిందే .

అయితే ఎవరు ఊహించిన విధంగా రాజమౌళి మరో కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. భారతీయ సినిమా రంగంపై వస్తున్న బయోపిక్ ను రాజమౌళి సమర్పిస్తున్నాడు. ఇదే విషయాని ట్విట్ లో పేర్కొన్నాడు. గత రెండు రోజులుగా రాజమౌళి నుండి భారీ ప్రకటన రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే .

కాగా కొద్దిసేపటి క్రితమే రాజమౌళి అనుకున్న విధంగానే ఓ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . భారతీయ సినీ చరిత్రను తెలియజేస్తూ మేడ్ ఇన్ ఇండియా అనే చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి నితిన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా వరుణ్ గుప్త .. ఎస్ ఎస్ కార్తికేయ ఈ సినిమాని నిర్మిస్తున్నారు . ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు రాజమౌళి . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . కాగా జక్కన్న సమర్పిస్తున్నాడు అంటే ఈ మూవీలో ఎంతో మేటర్ ఉంది అని ఫాన్స్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ముందుగానే చెప్పేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news