Newsఅల్లు అర్జున్ సినిమాలో న‌టించేందుకు భ‌య‌ప‌డుతోన్న స్టార్ హీరోయిన్లు... షాకింగ్ రీజ‌నే...

అల్లు అర్జున్ సినిమాలో న‌టించేందుకు భ‌య‌ప‌డుతోన్న స్టార్ హీరోయిన్లు… షాకింగ్ రీజ‌నే ఉందే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ చేసిన నటనకు గాను దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రస్తుతం బన్నీ పుష్ప‌ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2టు షూటింగ్లో బిజీగా ఉన్నారు.

వ‌చ్చే యేడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ ముందుకు రానుంది. ఇక పుష్ప 1 సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఊ అంటావా మామ అంటూ సమంత వేసిన చిందులకు అన్ని భాషల్లో విపరీతమైన ఆదరణ దక్కింది. అలాగే పుష్ప 2 లో కూడా స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ పాటలో డాన్స్ చేసేందుకు ముగ్గురు స్టార్ హీరోయిన్లను సంప్రదించారట.

అయితే ఈ ముగ్గురు హీరోయిన్లు కూడా అల్లు అర్జున్ పక్కన నటించమని ఈ ఆఫర్ను తిరస్కరించారట. రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా కూడా వీరు బన్నీ పక్కన నటించేందుకు ఒప్పుకోలేదట. బ‌న్నీ సినిమాలో స్పెషల్ సాంగ్లో డ్యాన్స్ చేస్తే తమను ఐటమ్ గర్ల్స్ అని ముద్ర వేస్తారని.. ఆ తర్వాత తమకు హీరోయిన్లుగా ఆఫర్లు వచ్చే విషయంలో ఇబ్బందులు తప్పవని వాళ్ళు నో చెప్పేసారట.

బన్నీ పక్కన హీరోయిన్గా ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరు.. ఎగిరి గంతేస్తారు. అలాంటిది బన్నీ పక్కన హాట్ ఐటెం సాంగ్ నటించేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. సమంత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేశాక ఆమెపై ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news