Newsమ‌హేష్ ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అనుకుంటే డిజాస్ట‌ర్ అయిన సినిమా ఇదే...!

మ‌హేష్ ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అనుకుంటే డిజాస్ట‌ర్ అయిన సినిమా ఇదే…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించారు. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉంటే మరి కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.. మరి కొన్ని టాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని డిజాస్టర్ సినిమాలు కూడా మహేష్ ఖాతాలో ఉన్నాయి. మహేష్ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మి చేసిన ఒక సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఆ సినిమా ఏదో కాదు శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆగడు 2014లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించింది. అంతకుముందు మహేష్- శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన దూకుడు సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే మహేష్ కెరీర్‌ను ఒక్కసారిగా టర్న్ చేసిన సినిమా దూకుడు.

మహేష్ లో కామెడీ యాంగిల్ ని కూడా ప్రేక్షకులకు దూకుడు సినిమాతో పరిచయం చేశాడు శ్రీనువైట్ల ఆ నమ్మకంతోనే మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్. సినిమా కథ‌పరంగా బాగున్న కామెడీ సీన్లు బాగానే వర్క్ అవుట్ అయినా ఎక్కడో ప్రేక్ష‌కుడికి నచ్చలేదు. దూకుడు తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ స్థాయికి తగినట్టుగా సినిమా లేకపోవడంతో ఆగడు సినిమా డిజాస్టర్ అయింది.

అయితే ఇప్పటికీ అందులోని సీన్లు యూట్యూబ్లో చూస్తుంటే భలేగా ఉంటాయి. ఆగడు సినిమా ఎక్కడ తేడా కొట్టింది అన్న ప్రశ్నకు ? అంత సులువుగా ఆన్సర్ అయితే దొరకదు. అయితే దూకుడు సినిమా సూపర్ హిట్ అవడంతో శ్రీను వైట్లను నమ్మి ఆగ‌డు ఛాన్స్ ఇచ్చాడు మహేష్.. అయితే సినిమా అంచనాలు అందుకోలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news