Moviesతొందర పడి కక్కుర్తి పడిన శ్రీలీల.. అటు మింగ లేదు-ఇటు కక్కలేదు.....

తొందర పడి కక్కుర్తి పడిన శ్రీలీల.. అటు మింగ లేదు-ఇటు కక్కలేదు.. చచ్చింది గొర్రె..!!

తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు తొందరపడి శ్రీలీల తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకుంది . ఎంతలా అంటే టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గర నుంచి స్టార్ హీరో వరకు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సెటిల్ అయిపోదామని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో వరకు అందరికీ శ్రీలీలనే కావాల్సి వస్తుంది .

మన సినిమాలో హీరోయిన్గా ఎవరిని పెట్టుకుందాం అని మేకర్స్ అడిగి అడగగానే అందరి నోట శ్రీ లీల పేరే వస్తుంది. దీనితో సోషల్ మీడియాలో ఆమె పేరు వైరల్ గా మారింది . అయితే ఆఫర్లు వస్తున్నాయి కదా అని తొందరపడి కక్కుర్తిలో అందరికీ కమిట్ అయిపోయిన శ్రీ లీల ఇప్పుడు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక తల ప్రాణం తోకకు వస్తుందట . అందరూ ఒకేసారి వచ్చి షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకోవడంతో ఒకరోజు షెడ్యూల్ హైదరాబాద్ లో ఉంటే మరో రోజు బెంగళూరులో ..మరో రోజు ఫారిన్ కంట్రీస్ లో ఉంటుందట .

ఇలాంటి క్రమంలో శ్రీలీల ఏ సినిమాకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి..? ఏ సినిమా షూట్లో పాల్గొనాలి అని తెగ ఆలోచిస్తుందట. మేకర్స్ సైతం శ్రీ లీల చేసిన పనికి ఫైర్ అవుతున్నారు. ఆలోచించుకొని కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయాలి ఇలా తొందరపడి అందరికీ మాటిచ్చేస్తే ఎలా ..? అంటూ చెప్పుకొస్తున్నారు . మరి కొందరు ఇన్నాళ్లు నేనే తోపు నేనే కత్తి అనుకున్న శ్రీలీల టైం బ్యాడ్ అందుకే కే ఇలాంటి చిక్కుల్లో ఇరుక్కుంది అంటూ చెప్పుకొస్తున్నారు . మొత్తానికి శ్రీ లీల అడ్డంగా ఇరుక్కుపోయింది. చచ్చింది గొర్రె అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి కొంతమంది జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news