Moviesబాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీతోనే బ్లాక్‌బస్ట‌ర్‌… ఆ ఒక్క‌టే కాస్త...

బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీతోనే బ్లాక్‌బస్ట‌ర్‌… ఆ ఒక్క‌టే కాస్త డిజప్పాయింట్‌..!

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినిమా ఎంట్రీ ఇటీవల కాలంలో పెద్ద చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై గత నాలుగైదు సంవత్సరాలుగా నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. అసలు బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఆ సినిమా వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ మోక్షజ్ఞ ఇంకా సినిమా రంగ ప్రవేశం చేయలేదు.

అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి.. ఆయన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేణుస్వామి సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే. వేణుస్వామి గతంలో సినిమా షూటింగ్లో ప్రారంభోత్సవానికి రిలీజ్ లకు ముహూర్తాలు పెట్టి పూజలు చేసేవారు. అయితే ఇటీవల కాలంలో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు.

చివరకు చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వేణుస్వామితో పాప పరిహార పూజలు.. దోష‌ పరిహార పూజలు కూడా చేయించుకుంటున్నారు. ఇక తాను అఖండ సినిమా షూటింగ్ సమయంలో మోక్షజ్ఞను కలిశానని చెప్పిన వేణుస్వామి.. మోక్షజ్ఞ జీవితం చాలా బాగుంది.. ఆయన సినిమా కెరీర్‌ ఇంకా బాగుంటుంది.. అయితే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇప్పట్లో ఉండకపోవచ్చు అని తేల్చేశారు.

మోక్ష‌జ్ఞ సినిమా ఎంట్రీకి మరో మూడేళ్లు పడుతుందని షాకింగ్ న్యూస్‌ పేల్చారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఈగరగా వెయిబీట్ చేస్తున్న నందమూరి అభిమానులు.. తెలుగు సినీ అభిమానులు మరో రెండు మూడు ఏళ్ళు అంటే కాస్త నిరాశపరిచే అంశమే అని చెప్పాలి. అయితే మోక్షజ్ఞ సినిమాలలో బాగా రాణిస్తారు.. రాజకీయాల జోలికి పోరు అని కూడా వేణుస్వామి చెప్పకనే చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news