Movies' భోళాశంక‌ర్ ' డిజాస్ట‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ కామెంట్స్.. చిరంజీవి అలా...

‘ భోళాశంక‌ర్ ‘ డిజాస్ట‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ కామెంట్స్.. చిరంజీవి అలా చేస్తే అంటూ ( వీడియో )


టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది. గత ఏడాది విజయ నటించిన లైగ‌ర్ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో నిరాశలోకి వెళ్లిపోయిన విజయ్ ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఖుషి

శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుండటం కూడా సినిమాకు మంచి హైప్‌ వచ్చింది. దీనికి తోడు టీజర్లు, ట్రైలర్ పార్టీలు అదిరిపోవడంతో ఖుషి పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి – సూపర్ స్టార్ రజినీకాంత్ పై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

విజయ్ మాట్లాడుతూ చిరు – రజనీ వంటి వారు ఐకానిక్ స్టార్స్ అని.. అలానే వారు ఎందరో నటులకు ఆదర్శం అని అన్నారు. వాళ్ళకి ఏదో ఒక ప్లాప్‌ వచ్చినంత‌ మాత్రాన అంతా అయిపోదని.. గతంలో రజనీ స‌ర్‌ చాలా ప్లాప్‌ల‌ను ఎదుర్కొని.. ప్రస్తుతం జైలర్ మూవీతో ఏకంగా రు. 500 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ అందుకున్నారని విజయ్ తెలిపారు.

ఇక మెగాస్టార్ చేయాలి అనుకుంటే ఇటీవల సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య మాదిరిగా మరో బ్లాక్ బస్టర్ సినిమాతో కం బ్యాక్ ఇస్తారని.. అలాంటి హీరోల సినిమాలతో జడ్జి చేయటం సోషల్ మీడియాలో నెగిటివ్గా మాట్లాడటం సరికాదని విజయ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా విజయ్ చిరంజీవిని మెచ్చుకుంటూ మాట్లాడడంతో మెగా అభిమానులు విజయ్ ఖుషి సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే సోషల్ మీడియాలో తమ సపోర్టు తెలియజేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news