Moviesవరుణ్-లావణ్య పెళ్లి డేట్ వచ్చేసిందోచ్.. ఆ స్పెషల్ డే రోజే ముహుర్తం..!?

వరుణ్-లావణ్య పెళ్లి డేట్ వచ్చేసిందోచ్.. ఆ స్పెషల్ డే రోజే ముహుర్తం..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి రీసెంట్గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా గత కొంతకాలంగా వీళ్ళ ప్రేమాయణం గుట్టు చప్పుడు కాకుండా మెయిన్ టైన్ చేస్తూ వచ్చారు. అయితే రీసెంట్గా జూన్ 9వ తేదీ నాగబాబు నివాసంలో గ్రాండ్ గా వీళ్ళ నిశ్చితార్ధం జరిగింది . ఇలాంటి క్రమంలోనే వీళ్ళ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది ..?ఎక్కడ జరుగుతుంది..? అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలైయాయి.

కాగా చాలామంది ఆగస్టు 25వ తేదీ ఇటలీలో గ్రాండ్ వెడ్డింగ్ డెస్టినేషన్ చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి . అయితే ఆ వార్తల్లో నిజం లేదంటూ కొట్టి పడేసాడు వరుణ్ తేజ్ . రీసెంట్గా ఆయన నటించిన గాండీవ దారి అర్జున సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి ముహూర్తాన్ని మా అమ్మే ఫిక్స్ చేయాలని ..మొత్తం మా అమ్మ ఇష్టప్రకారమే జరుగుతుంది అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 1వ తేదీన వరుణ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి గ్రాండ్గా జరగబోతుందట .

మూడు రోజులపాటు ఈ పెళ్లి జరగబోతుంది అంటూ తెలుస్తుంది. అంతేకాదు ఆ డేట్స్ లో మెగా అల్లు కుటుంబం ఎటువంటి ప్రోగ్రామ్స్ కి అపాయింట్మెంట్ ఇవ్వకూడదు అంటూ ముందుగానే చిరంజీవి అందరికీ చెప్పుకు వచ్చారట . ఈ క్రమంలోనే మెగా ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ వెడ్డింగ్ కి ఇండస్ట్రీ నుంచి ఏ హీరో అటెండ్ కావడం లేదు . కేవలం లావణ్య త్రిపాఠి మెగా అల్లు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు అంటూ తెలుస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్లో ఓ గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వబోతున్నారని .. ఆ రిసెప్షన్ కి టాలీవుడ్ ప్రముఖులు మొత్తం రాబోతున్నట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news