Movies"దానికి ఒప్పుకుంటేనే సినిమా..లేదంటే క్యాన్సిల్".. "బేబీ" కండీషన్లకి డైరెక్టర్స్ మైండ్ బ్లాక్..!!

“దానికి ఒప్పుకుంటేనే సినిమా..లేదంటే క్యాన్సిల్”.. “బేబీ” కండీషన్లకి డైరెక్టర్స్ మైండ్ బ్లాక్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరే మారుమ్రోగిపోతుంది . ఆమె రీసెంట్గా నటించిన సినిమా “బేబీ”. ఈ సినిమా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజై సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోయిన్స్ కి గట్టి కాంపిటీషన్ ఇస్తున్న వైష్ణవి చైతన్య .. తన వద్దకు వచ్చే డైరెక్టర్స్ కు క్రేజీ కండిషన్స్ పెడుతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది .

ఇప్పటికే వైష్ణవి చైతన్య అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా ఓ సినిమాలో ఫిక్స్ అయింది. అంతేకాదు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “డబల్ ఇస్మార్ట్” లో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు వైష్ణవి చైతన్య . కాగా ఇలాంటి క్రమంలోనే వైష్ణవి చైతన్య తన వద్దకు వస్తున్న డైరెక్టర్ ల కు కొత్త కండిషన్ పెడుతుందట .

ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైష్ణవి చైతన్య ఒక్కో సినిమాకి రెండు కోట్లు డిమండ్ చేస్తుందట . నిజానికి బేబీ సినిమాకి వైష్ణవి చైతన్య అందుకున్న రెమ్యూనరేషన్ కేవలం 30 లక్షలు. కానీ రెండో సినిమాకి మాత్రం ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేస్తుందట . దానికి కారణం ఆమెకున్న క్రేజ్ అంటూ తెలుస్తుంది. అంతేకాదు సినిమాకి కమిట్ అయిన వెంటనే సగం డబ్బులు అడ్వాన్స్ కింద ఇచ్చేయాలి అంటూ కండిషన్ పెడుతుందట .

అంతేకాదు బేబీ సినిమాల్లోలా హాట్ రొమాన్స్ చేయను అంటూ కూడా ముందే చెప్పేస్తుందట . పద్ధతిగా ఉన్న రోల్స్ చేస్తాను అంటూ డైరెక్టర్ కి స్క్రిప్ట్ మార్చమనే స్థాయికి వెళ్లిపోయింది వైష్ణవి చైతన్య అంటూ ప్రచారం జరుగుతుంది . దీంతో ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక్క హిట్టు పడగానే అంత బలుపా..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news