Moviesచిన్ని కృష్ణ బ‌ర్త్ డే.. ముద్దుల‌తో ముంచెత్తిన సురేఖ‌, సుప్రీత (...

చిన్ని కృష్ణ బ‌ర్త్ డే.. ముద్దుల‌తో ముంచెత్తిన సురేఖ‌, సుప్రీత ( వీడియో)

టాలీవుడ్ సీనియర్ నటిమని సురేఖవాణి సోషల్ మీడియాలో తన కుమార్తె సుప్రీతితో కలిసి ఎలాంటి హడావిడి చేస్తుందో చెప్పక్కర్లేదు. సురేఖ- సుప్రీత ఇద్దరూ కలిసి సోష‌ల్ మీడియాతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ వయసులో తన కూతురితో కలిసి సురేఖ బోల్డ్ షో చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ తల్లి కూతురు చేసే వీడియోలకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే.

కొన్నిసార్లు వీరిద్దరూ గట్టి ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి సురేఖ- సుప్రీత గట్టి కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటారు. తాజాగా వీరు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సురేఖ వాణి- సుప్రీత తాజాగా వాళ్ళ చిన్నకృష్ణుడికి పుట్టినరోజు సెలబ్రేషన్లు చేశారు. అంతేకాదు తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి చిన్ని కృష్ణుడు అని ముద్దులతో ముంచేత్తారు. ఒకరి తర్వాత మరొకరు చిన్ని కృష్ణుడిని పట్టుకుని నలిపేశారు.

అయితే చిన్ని కృష్ణుడు కూడా వారిద్దరి మూతులు నాకేసాడు. ఇంతకీ ఆ చిన్ని కృష్ణుడు ఎవరో కాదు సురేఖ వాణి సుప్రీత పెంచుకున్న పెట్ డాగ్.. వీళ్ళ ఇంట్లో పెరుగుతున్న పెట్ డాగ్‌ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పెట్ డాగ్‌కి ఎంత అదృష్టం చేస్కుందో అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news