Moviesశ్రీలీల ఊర‌మాస్‌ ఊపుడు చూస్తుంటే.. పుష్పలో స‌మంత ఎందుకు ప‌నికిరాదు…. (...

శ్రీలీల ఊర‌మాస్‌ ఊపుడు చూస్తుంటే.. పుష్పలో స‌మంత ఎందుకు ప‌నికిరాదు…. ( వీడియో )

యంగ్ ఎన‌ర్జిటిక్ రామ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘స్కంధ‌’. శ్రీలీల కథానాయికగా న‌టిస్తోన్న ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాత. పాన్‌ ఇండియా స్థాయిలో నవంబరు 15న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజ‌ర్‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్ అదిరిపోయింది.

ఇక తాజాగా ‘గందారబాయి’ అనే ఊర మాస్‌ పాట రిలీజ్‌ చేశారు. థ‌మన్‌ స్వర పరిచిన ఈ గీతాన్ని నకాశ్‌ అజీజ్‌, సౌజన్య భాగవతుల పాడ‌గా… ప్రేమ్‌ రక్షిత్‌ నృత్య రీతులు స‌మ‌కూర్చారు. ఇక టీజ‌ర్‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్‌కు అదిరిపోయే రెస్సాన్స్ వ‌చ్చింది. ఇక తాజా పాట‌లో అయితే శ్రీలీల ఊర‌మాస్ స్టెప్పుల‌తో రెచ్చిపోయింది.

ఈ సాంగ్ అయితే మాస్‌కి పిచ్చ‌పిచ్చ‌గా నచ్చేస్తుంది. ఈ పాటలో రామ్‌, శ్రీలీల వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. అస‌లు శ్రీలీల ఊపుళ్ల ముందు పుష్ప ఐటెం సాంగ్‌లో స‌మంత ఊపుడు ఏ మాత్రం స‌ర‌పోదు అన్నంత‌గా రెచ్చిపోయింది. ఇక స్కంధ సినిమా బోయపాటి స్టైల్‌లో సాగే కథ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news