Moviesఆ విషయంలో ఎన్టీఆర్ అంటే ప్రణతికి అంత కోపమా..?.. ఇప్పటికి దాని...

ఆ విషయంలో ఎన్టీఆర్ అంటే ప్రణతికి అంత కోపమా..?.. ఇప్పటికి దాని కారణంగా గొడవ పడుతున్నారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువగానే ఉంటుంది . నటనలో తాతకు మించిపోయే సత్తా ఉన్న ఈ హీరో ఇండస్ట్రీకి నెంబర్ వన్ హీరో అంటూ చాలామంది ప్రముఖులు చెప్పుకు వచ్చారు. అంతేకాదు రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో త్వరలోనే హాలీవుడ్ రేంజలో సినిమాలను కూడా చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . హాలీవుడ్ డైరెక్టర్లు అయితే ఈయనతో సినిమా చేయడానికి సిద్ధమంటూ ఓపెన్ గానే ప్రకటించేశారు . తారక్ సిగ్నల్ ఇవ్వడమే లేటు.

కాగా ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి . మొదటి నుంచి చాలా కమిట్మెంట్ గల ఎన్టీఆర్ కి కోపం ఎక్కువ అనే సంగతి అందరికీ తెలిసిందే . అయితే ఆ కోపం అంటేనే ఎన్టీఆర్ భార్య ప్రణతికి చిరాకు అంటూ తెలుస్తుంది. అఫ్కోర్స్ ఏ అమ్మాయికైనా సరే తన భర్త కొపడితే ఎవరికి నచ్చదు.. కానీ ఎన్టీఆర్ కి కోపం చాలా త్వరగా వచ్చేస్తుందని.. ఆ కోపంలో ఏదైనా మాట్లాడేస్తాడని ..ఆ తర్వాత బాధపడతాడు అని.. అంతటి వరకు రాకుండా మన జాగ్రత్తలో మనమే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది కదా అనేది ప్రణతి ఒపీనియన్ .

అయితే ఎన్టీఆర్ మాత్రం చిన్నప్పటి నుంచి చాలా ఓపెన్ మైండెడ్ . ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు.. స్పాట్లో కోపాన్ని ప్రదర్శించేస్తాడు.. ఆ తర్వాత అలా ప్రవర్తించినందుకు సారీ చెబుతాడు. దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి . గతంలో యాంకర్ సుమపై కూడా స్టేజి పైన కోప్పడిన తారక్ ఆ తర్వాత పర్సనల్గా ఆమెకు కాల్ చేసి మరి సారీ చెప్పుకొచ్చాడు . అయితే ఇదే విషయంలో ఎన్టీఆర్ అంటే ప్రణతికి నచ్చదట . ఏదైనా సరే ఆలోచించాలి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటూ చెప్పుకోస్తుందట . ఇప్పటికీ వాళ్లిద్దరి మధ్య ఈ విషయంలో గొడవలు వస్తూనే ఉంటాయట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news