Movies"వాళ్లని బ్రతకనివ్వకూడదు".. కోపంతో ఊగిపోయిన పూజా హెగ్డే.. ఏమైందంటే..?

“వాళ్లని బ్రతకనివ్వకూడదు”.. కోపంతో ఊగిపోయిన పూజా హెగ్డే.. ఏమైందంటే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలి అంటే క్యాస్టింగ్ కౌచ్ కంపల్సరీ అన్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఈ క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా పెరిగిపోతోంది . కేవలం హీరోయిన్స్ కాదు ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడానికి వచ్చే అమ్మాయిలను సైతం వదలడం లేదు ఈ దుర్మార్గులు .

ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించగా.. రీసెంట్గా టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజ హెగ్డే సైతం మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసింది . ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ..” ఇప్పటి వరకు నాకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురవ్వలేదు. అయితే నా ఫ్రెండ్స్ మాత్రం చాలా మంది చెప్పుకొచ్చారు . ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఉంది అని ..అమ్మాయిలను దారుణంగా ఏడిపిస్తారు అని ..వాళ్లను పట్టి హింసిస్తారని చెప్పుకొచ్చారు”.

“కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక కొంతమంది అమ్మాయిలకు ఇవి తప్పవు . అయితే మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి.. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు ఏమి చేయలేరు . అమ్మాయిలు ధైర్యంగా ఉండటమే నేటి సమాజానికి చాలా ఇంపార్టెంట్. అలా అమ్మాయిలను ఇబ్బంది పెట్టే దుర్మార్గులని అస్సలు బ్రతకనివ్వకూడదు “అంటూ కూసింత ఘాటుగానే స్పందించింది . దీంతో అభిమానులు సైతం షాక్ అయిపోతున్నారు . అంతేకాదు మళ్లీ సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవ్వడం కోసమే పూజ ఇలా కాంట్రవర్షియల్ కంటెంట్ లో వేలు పెడుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news