Moviesఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేష‌న్ రిపీట్‌… నిర్మాత కూడా ఫిక్స్ అయ్యాడుగా…!

ఎన్టీఆర్ – సుకుమార్ కాంబినేష‌న్ రిపీట్‌… నిర్మాత కూడా ఫిక్స్ అయ్యాడుగా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – సుకుమార్ కాంబినేషన్లో తరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైలిష్ ఫ్రెంచ్ గడ్డంతో ఆకట్టుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్ వేలో సాగింది. ముఖ్యంగా కథ కూడా కొత్తదనంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ చాలామంది క్లాస్ అభిమానులకు కూడా దగ్గరయ్యాడు.

ఈ సినిమా తర్వాత సుకుమార్ కంప్లీట్ గా జోనర్ మార్చేసి రంగస్థలం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పుష్ప‌ సినిమాతో పాన్ ఇండియా హిట్ తన ఖాతాలో వేసుకుని ఇప్పుడు పుష్ప 2 సినిమాని చెక్కే పనిలో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివతో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నాన్నకు ప్రేమతో తర్వాత మరోసారి సుకుమార్ – ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.’

మైత్రీ మూవీ మేకర్స్ లో వీరి సినిమా ఉండబోతోందంట. ఇప్ప‌టికే క‌థ రెడీ చేసిన సుకుమార్ ఎన్టీఆర్‌కు కూడా ఓ సారి వినిపించ‌గా.. ఇప్పుడు ఫైన‌ల్‌గా మ‌రోసారి క‌థ చెప్పి లాక్ చేసే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. సుకుమార్ పుష్ప 2 త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల‌తో ప్రాజెక్టులు అనుకుంటున్నాడు. ఈ లోగా ఎన్టీఆర్ దేవ‌ర‌, ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌, వార్ సినిమాలు పూర్తి చేస్తాడు. ఆ వెంట‌నే సుకుమార్ – ఎన్టీఆర్ సినిమా ఉండొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news