Moviesపవన్ కళ్యాన్-ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్...

పవన్ కళ్యాన్-ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.. మంచి ఛాన్స్ వదులుకునేసిందే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే క్రేజీగా సెట్ అవుతూ ఉంటాయి . ఒక్కసారి ఆ హీరో హీరోయిన్ కలిసి నటిస్తే చాలు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలై పోతూ ఉంటాయి . సిల్వర్ స్క్రీన్ షేక్ అవుతూ ఉంటాయి. అలాంటి ఎన్నో సూపర్ హిట్ క్రేజీ కాంబో సెట్ చేసిన డైరెక్టర్ కొందరు హీరో హీరోయిన్లను సెట్ చేయడంలో విఫలం అవుతూ ఉంటారు . వాళ్లలో ఒకరే ఆర్తి అగర్వాల్ – పవన్ కళ్యాణ్ . అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోస్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిన ఆర్తి అగర్వాల్.. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలి అని ఎంతో ఆశ పడిందట . ఎంతో ఈగర్ గా కూడా వెయిట్ చేసిందట .

ఆశ్చర్యం ఏంటంటే పవన్ ఫ్యాన్స్ సైతం పవన్ కళ్యాణ్ ఆర్తి అగర్వాల్ – సినిమా వస్తే బాగుంటుంది అంటూ ఎంతో వెయిట్ చేశారట. అయితే ఆ అవకాశం రానే రాలేదు . కానీ అలాంటి అవకాశం వచ్చినట్లే వచ్చే చేజారిపోయింది ఆర్తి అగర్వాల్ కి. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా గుడుంబా శంకర్ . ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ జాతకం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మీరాజాస్మిన్ కంటే ముందు ఆర్తి అగర్వాల్ ని అనుకున్నారట మేకర్స్.

కానీ అప్పటికే ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్తి అగర్వాల్ ను సినిమాలో పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదట. అంతేకాదు కొన్ని సీన్స్ లో ఆర్తి అగర్వాల్ కన్నా మీరాజాస్మినే బాగుంటుంది అంటూ ఫిక్స్ అయిపోయి ..మీరాజాస్మిన్ ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారట. దీంతో మంచి ఛాన్స్ మిస్ అయింది ఆర్తి. ఒకవేళ కుదిరి ఉంటే మాత్రం పవన్ అభిమానులు కోరిక తీరిపోయి ఉండేది . ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన విషయం అందరికీ తెలిసిందే . ప్రజెంట్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి కీలక పాత్ర పోషిస్తూ కెరియర్ లో దూసుకుపోతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news