Movies"లైవ్ లోనే క‌న్నీళ్లు పెట్టుకున్న దుల్కర్ సల్మాన్".. రాత్రికి రాత్రి వీడియో...

“లైవ్ లోనే క‌న్నీళ్లు పెట్టుకున్న దుల్కర్ సల్మాన్”.. రాత్రికి రాత్రి వీడియో డిలీట్‌.. అభిమానులు ఆందోళ‌న‌..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కూడా అభిమానులతో ఓపెన్ గా మాట్లాడిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో లైవ్ లో స్టార్ సెలబ్రిటీస్ తెగ చర్చించేసుకుంటూ ఉంటారు . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ లైవ్ సెషన్ లో పాల్గొంటూ అభిమానులకి కావలసిన ఆన్సర్స్ ఇస్తున్నారు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండే దుల్కర్ సల్మాన్.. అభిమానులు ఎక్స్పెక్ట్ చేయని వీడియోని పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో దుల్కర్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రీజన్ ఏంటో తెలియదు కానీ పెట్టిన కొన్ని క్షణాలలోనే ఆయన ఈ వీడియోని డిలీట్ చేశాడు . అంతేకాదు ఇప్పుడు అభిమానులు ఆ వీడియో గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. రీసెంట్ గా దుల్కర్ ఓ వీడియో పోస్ట్ చేశాడు . ఆ వీడియోలో ఏముందంటే..” కొంతకాలంగా నాకు ఎందుకో నిద్ర పట్టడం లేదు.. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా లేవు ఉండవు అన్నది నిజం . ఇలాంటి దాని తొలిసారి ఫేస్ చేస్తున్నాను .. నా మనసు నుంచి దాన్ని తొలగించుకోలేకపోతున్నాను ..ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు ” అంటూ దుల్కర్ సల్మాన్ కళ్ళు తుడుచుకుంటూ కనిపించారు .

దీంతో ఆయన ఇంత ఎమోషనల్ గా మారిపోవడానికి కారణం ఏంటి ..? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఏమైంది అంటూ వరుస కామెంట్లు చేయడంతో కొద్దిసేపటికే ఆయన ఈ వీడియోని డిలీట్ చేశాడు . అయితే అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news