Moviesస్టార్ హీరో చేసిన పెంట పని.. నితిన్ కి హ్యాండ్ ఇచ్చిన...

స్టార్ హీరో చేసిన పెంట పని.. నితిన్ కి హ్యాండ్ ఇచ్చిన రష్మిక మదన్నా..అడ్వాన్స్ డబ్బులు కూడా రిటర్న్..!?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నితిన్ కు నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. హ్యాండ్ ఇచ్చిందా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే తెరపై నితిన్ – రష్మికల జంట సూపర్ అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి . గతంలో వీళ్ళిద్దరూ కలిసి వెంకీ కూడా దర్శకత్వంలో భీష్మ అనే సినిమాలో నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను నెలకొల్పింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వడానికి చాలా టైమే పట్టింది .

రీసెంట్ గానే వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా క్రేజీ కాంబో ని సెట్ అయినట్టు అధికారికంగా ప్రకటన చేసింది టీం. అట్టహాసంగా ఈ పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సినిమాని మైత్రి మూవీ నిర్మించాలని డిసైడ్ అయింది. కాగా ఫుల్ టు ఫుల్ లవ్ – రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రష్మిక టూ హాట్ గా నటించడానికి కూడా సిద్ధపడిందట . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ లాస్ట్ మూమెంట్లో నితిన్ కి హ్యాండ్ ఇచ్చింది రష్మిక మందన అంటూ తెలుస్తుంది.

ఈ సినిమా నుంచి అమ్మడు తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అడ్వాన్స్ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసిందట రష్మిక మందన్నా. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ సినీ వర్గాలలో మాత్రం ఈ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రష్మిక పుష్ప2 – అనిమల్ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది . మరి అలాంటి రష్మిక ఇలాంటి చిన్న హీరోతో నటిస్తే ఇమేజ్ డామేజ్ అవుతుంది అన్న కారణంగానే రష్మిక బ్రెయిన్ వాష్ చేసిన ఓ స్టార్ హీరో ఆమెకు ఇలాంటి సజెషన్ ఇచ్చారట.

రష్మిక సైతం ఆ హీరోని గుడ్డిగా నమ్మేసి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే రష్మిక ఇలా సగంలో హ్యాండ్ ఇవ్వడం చాలా తప్పు అంటున్నారు సినీ ప్రముఖులు .అంతేకాదు ఇప్పుడు నితిన్ తో సినిమా చేయడానికి వేరే ఏ హీరోయిన్ కూడా రెడీగా లేరు . మరి అలాంటప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్లేనా..? అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన బిహేవియర్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news