Moviesగోల్డెన్ ఆఫర్ పట్టేసిన జాన్వీకపూర్.. అమ్మ లక్కి హీరోతో కోలీవుడ్ లోకి...

గోల్డెన్ ఆఫర్ పట్టేసిన జాన్వీకపూర్.. అమ్మ లక్కి హీరోతో కోలీవుడ్ లోకి ఎంట్రీ..!!

శ్రీదేవి ముద్దుల కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ .. ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇంకా పక్కాగా చెప్పాలంటే ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టనపటికి జాన్వి కపూర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది . తెలుగులో తన ఫస్ట్ సినిమాకి కమిట్ అయింది . ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న “దేవర” సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .

ఇదే కాకుండా తెలుగులో మరో రెండు సినిమాలకు సైతం కమిట్ అయింది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి . అయితే తెలుగులో రెండో సినిమా చేసే కన్నా ముందే కోలీవుడ్లో తన ఫస్ట్ సినిమాని చేయడానికి సిద్ధపడుతుంది జాన్వికపూర్ అంటూ ప్రచారం జరుగుతుంది . ఆశ్చర్యమేంటంటే ఈ సినిమాను నిర్మించబోయేది కమల్ హాసన్ . కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్- శ్రీదేవి లది సూపర్ హిట్ జంత అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

శ్రీదేవి వారసురాలు జాన్వి కపూర్ ని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతలను కమలహాసన్ తన భుజాలపై వేసుకున్నారట. నయనతార భర్త విగ్నేశ్ శివన్ దర్శకత్వంలో లవ్ టుడే కధానాయకుడు ప్రదీప్ రంగనాథం హీరోగా ఓ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట . ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ ని తీసుకునే విధంగా ఆలోచిస్తున్నాడు కమల్ హాసన్ అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news