Newsఎన్టీఆర్‌పై జపాన్ మంత్రి కామెంట్స్‌… తార‌క్ ఫ్యాన్స్‌ను అస్స‌లు ఆప‌లేం..!

ఎన్టీఆర్‌పై జపాన్ మంత్రి కామెంట్స్‌… తార‌క్ ఫ్యాన్స్‌ను అస్స‌లు ఆప‌లేం..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫ్యీజులు ఎగిరిపోయే న్యూస్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ హీరోగా భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” చేస్తున్న సంగతి లిసిందే. ఈ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాన్ ఇండియా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. సెన్షేష‌న‌ల్ హిట్ అయిన ఈ “రౌద్రం రణం రుధిరం” సినిమాతో ఎన్టీఆర్‌కు గ్లోబల్ గా మరింత క్రేజ్ వ‌చ్చింది.

ఇక త్రిబుల్ ఆర్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 1200 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా వ‌చ్చింది. ఈ సినిమా గ‌త యేడాది జ‌పాన్‌లో రిలీజ్ అయ్యి సెన్షేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఇక జ‌పాన్‌లో ఎన్టీఆర్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ జ‌పాన్ అభిమానులు ఎన్టీఆర్ న‌టించిన సినిమాల‌కు డ్యాన్సులు, టిక్‌టాక్ వీడియోలు చేసి మ‌రి వైర‌ల్ చేస్తూ ఉంటారు.

ఈ క్ర‌మంలోనే త్రిబుల్ ఆర్ సినిమా జ‌పాన్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డంతో ఎన్టీఆర్ పై జపాన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ యోషిమాస హయాషి చేసిన కామెంట్స్ సెన్షేష‌న‌ల్‌గా మారాయి. ఓ మీట్‌లో హ‌యాషి మాట్లాడుతూ RRR లో ఇద్దరు హీరోలు ఉన్నారు.. అయితే తాను మాత్రం ఎన్టీఆర్ ని ప్రిఫర్ చేసుకుంటాన‌ని చెప్పారు. ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్‌ను తార‌క్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news