Newsసమంత‌కే ఎసరు పెట్టిన శ్రీలీల.. లడ్డులాంటి ఆఫర్ పట్టేసిందిగా..!!

సమంత‌కే ఎసరు పెట్టిన శ్రీలీల.. లడ్డులాంటి ఆఫర్ పట్టేసిందిగా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ కి జంటగా రష్మిక నటిస్తుంది.. గతఏడాది నుంచి ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప 1 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. బన్నీ, రష్మిక నటన అంతా ఒక ఎత్తు అయితే… సమంత ఐటమ్ సాంగ్ మాత్రం వేరే లెవెల్. ఊ అంటావా.. మావా..ఊఊ అంటావా..మావా… అంటూ ఇండస్ట్రీని షేక్ చేసింది సమంత.

ఇంకా ఈసారి పుష్ప 2 తో కూడా అంతకుమించి చేయాలని మంచి ఐటెం సాంగ్ ని చూస్తున్నాడట. ఇందుకోసం సుకుమార్ బాగా కష్టపడుతున్నాడని టాక్. ముఖ్యంగా సామ్ లా ఐటమ్ సాంగ్ చేసే హీరోయిన్ కోసం వెతుకుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ పేర్లు పరిశీలనలోకీ వచ్చాయి. ఊర్వసి రౌతేలా ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అది నిజం కాదని సమాచారం.

ఇక తాజాగా ఈ ఐటంమ్ సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారని టాక్ నడుస్తుంది. ఆమె ఎవరో కాదు… టాలీవుడ్ ని షేక్‌ చేస్తున్న హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ డ్యాన్స్ చూసి ఫిదా అయిన సుకుమార్.. బన్నీ – శ్రీలీల జతకడితే హైప్ వస్తుందని భావించి ఈ బ్యూటీ ను సంప్రదించారట. అయితే శ్రీ లీల మాత్రం నో చెప్పిందట. బన్నీతో ఒక్క సాంగ్ చేస్తే… ఫుల్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందో.. రాదో అని ఆలోచించిందట.

ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఇది మాత్రం నిజం కాదని శ్రీలీల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న ఆమె.. ఒక ఐటమ్ సాంగ్ చేస్తుందా…? ఇదంతా ఫేక్ అని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news