Moviesఫుల్ గా తాగేసి శేఖర్ మాస్టర్ తో అసభ్యకరంగా మాట్లాడిన హైపర్...

ఫుల్ గా తాగేసి శేఖర్ మాస్టర్ తో అసభ్యకరంగా మాట్లాడిన హైపర్ ఆది..వీడియో వైరల్..!!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై షోస్ టి ఆర్ పి ల కోసం ఏ రేంజ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉంటుంది జబర్దస్త్ – శ్రీదేవి డ్రామ కంపెనీ.. ఢీ ప్రోగ్రాం . ఈ మధ్యకాలంలో ఈ షోలు ఎలా వల్గర్ – డబల్ మీనింగ్ కంటెంట్ను ప్రమోట్ చేస్తుందో షో చూసే ప్రతి ఒక్కరికి అర్థం అయిపోతుంది. కాగా రీసెంట్ గా ఢీ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

అయితే ఈ ప్రోమోలో ఎప్పటిలాగే డబల్ మీనింగ్ పంచెస్ వేస్తూ.. రచ్చ రంబోలా క్రియేట్ చేశాడు హైపర్ ఆది . ప్రతిసారి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమోలో హైపర్ ఆది తనదైన స్టైల్ లో రఫ్ఫాడించేశాడు. లుంగీ కట్టుకొని.. చిరిగిన షర్టు.. చేతిలో బాటిల్ పట్టుకొని ఓ లవ్ ఫెయిల్యూర్ లా కనిపించాడు . దీంతో శేఖర్ మాస్టర్ కూడా స్కిట్ లో భాగమై ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా దీపిక పిల్లి – అఖిల్ ను తీసుకొని రావడంతో ప్రదీప్(ఎవడీడు అని అడిగేసరికి మా బావ అంటూ సమాధానం చెబుతుంది. ఆ క్షణమే శేఖర్ మాస్టర్ ఇంకొక ఆయన ఏడి అంటూ ఆదిని ఉద్దేశించి అడుగుతాడు. శేఖర్ మాస్టర్ ఇలా అడిగేసరికి హైపర్ ఆది చేతిలో మందు బాటిల్ పట్టుకొని.. లుంగి పైకి ఎత్తి మరి స్టేజి పైకి ఎంట్రీ ఇస్తాడు . ఇలా మందు బాటిల్ చేతుల పట్టుకొని స్టేజ్ పైకి ఎంట్రీ ఎలా ఇస్తామంటూ శేఖర్ మాస్టర్ అనడంతో .. “అసలు నీ ప్రాబ్లం ఏంటి..?” అంటూ కొంచెం వ్యంగ్యంగా హెడ్వైట్ గా అడుగుతాడు .

దీంతో ఒక్కసారి శేఖర్ మాస్టర్ “ఏమైంది నీకు..? ఫస్ట్ టైం మందు తాగుతున్నావా..? అంటుంటే..” ఎవడికోయ్ ఫస్ట్ టైం.. ఐదు సీజన్ నుంచి తాగుతున్న ఆ గుట్టు నీకు తెలుసా..?” అంటూ కూసింత హద్దులు మీరిన డైలాగ్స్ చెప్పారు . అయితే ఇవంతా ఫన్నీగా ఉన్నప్పటికీ శేఖర్ మాస్టర్ లాంటి పెద్ద వ్యక్తితో అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో హైపర్ ఆది మరీ ఓవర్ చేస్తున్నాడు అన్న కామెంట్లు కూడా వినపడుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news