Moviesకన్నడ పిల్ల కృతిశెట్టి ఇంత స్పీడా.. ఒక్క దెబ్బతో సోషల్ మీడియాని...

కన్నడ పిల్ల కృతిశెట్టి ఇంత స్పీడా.. ఒక్క దెబ్బతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలి అంటే సోషల్ మీడియా “కీ” పాయింట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు అంటే టాలెంట్ ని నటనను నమ్ముకునే వాళ్ళు హీరోయిన్స్ . అయితే ఇప్పుడు ఎక్కువ మంది సోషల్ మీడియానే నమ్ముకుంటూ వస్తున్నారు. ఓ సినిమాలో అవకాశం రావాలి అన్న ఆ సినిమా సక్సెస్ అవ్వాలి అన్న ప్రమోషన్స్ చేయాలి అన్నా..తర్వాత ఆ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది తెలియాలి అన్న .. సోషల్ మీడియా కీ పాయింట్ అని అందరికీ తెలిసిన విషయమే .

అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న బేబమ్మ ఓ అరుదైన ఘనత సాధించింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కృతి శెట్టి తాజాగా ఇంస్టాగ్రామ్ లో 6 మిలియన్ల ఫాలోవర్స్ ను కైవసం చేసుకుంది . ఆశ్చర్యం ఏంటంటే అతి తక్కువ టైంలోనే కృతిశెట్టి ఈ అరుదైన మైల్ స్టోన్ చేరుకోవడం విశేషం . ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఇంత తక్కువ టైం కి ఇంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోలేదు.

దీంతో సోషల్ మీడియాలో కృతి శెట్టి పేరు మరోసారి వైరల్ గా మారింది. అంతేకాదు వరుస ప్లాప్ సినిమాలు పడుతున్న కృతి శెట్టి సోషల్ మీడియాలో జనాలు లైక్ చేయడానికి మెయిన్ రీజన్ ఆమె చేసే రకరకాల డిఫరెంట్ ఫోటోషూట్స్ అంటూ తెలుస్తుంది . త్వరలోనే కృతి శెట్టి విజయ్ సినిమాలో సైతం మెరవబోతోంది అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే జయం రవి నటిస్తున్న సినిమాలోను ఛాన్స్ అందుకుంది ఈ బ్యూటి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news