Newsశ్రీలీల కి కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా..? ప్రతి అమ్మాయి...

శ్రీలీల కి కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా..? ప్రతి అమ్మాయి ఇంతేనా బాసూ..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అయితే ఇప్పటివరకు చేసింది రెండు సినిమాలైనా సరే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మాత్రం 100 సినిమాలు చేసిన హీరోయిన్ రేంజ్ దక్కించుకుంది. దానికి మెయిన్ రీజన్ శ్రీలీల యాక్టివ్ నెస్.. అమాయకతనం.. చిలిపి ప్రదర్శన అనే చెప్పాలి .

అయితే ఎంతో కూల్ గా చాలా అల్లరిగా ఉండే శ్రీలీలకు సైతం కోపం వస్తుందట . ఎవరైనా తనకు ఇష్టం లేని పని చేసిన తన మాట వినకపోయిన శ్రీలీల కి ఇట్టే కోపం వచ్చేస్తుందట . అయితే కోపం వస్తే అందరిలాగా వస్తువులు పగలగొట్టడం ..ఫైర్ అయిపోయి బూతులు తిట్టడం లాంటివి చేయదట ..శ్రీలీలకు కోపం వస్తే వంటింట్లోకి వెళ్లి ముందు ఏది ఉంటే అది ప్లేట్ నిండా పెట్టుకొని కడుపునిండా తినేసి నిద్రపోతుందట .

అప్పుడు తన కోపం కూల్ అయిపోతుందట . శ్రీ లీల మంచి ఫుడ్ అని కూడా తెలుస్తుంది . ఈ క్రమంలోనే అబ్బాయిలు శ్రీలీలకు కోపం వస్తే ఏం చేస్తుందో అనే పని ని ట్రెండ్ చేస్తున్నారు . అంతే కాదు ప్రతి అమ్మాయి ఇలాగే బిహేవ్ చేస్తే అసలు ఇంట్లో గొడవలే రావు అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీలీల పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news