Movies"స్పైడర్ " మూవీలో నటించిన ఈ వైల్డ్ బుడ్డోడు.. ఇప్పుడు ఎలా...

“స్పైడర్ ” మూవీలో నటించిన ఈ వైల్డ్ బుడ్డోడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా…? మళ్ళీ అదే పనా..!

సినిమా ఇండస్ట్రీలో కొందరు చైల్డ్ ఆర్టిస్ట్ లని అసలు మర్చిపోలేం . వాళ్లు నటించిన సినిమాలు రిలీజ్ అయ్యి ఏళ్లు గడిచిపోతున్న సరే ఇప్పటికి మన మనసులో చెరగని స్థానాన్ని సంపాదించి పెట్టుకుంటారు . అలాంటి నటనతో స్టార్ హీరోల కన్నా హ్యుజ్ రేంజ్ లో అభిమానులు చేత శభాష్ అనిపించుకున్న స్టార్ కిడ్స్ ఎంతో మంది ఉన్నారు . ఆ లిస్టులోకే వస్తాడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ బుడ్డోడు .

మహేష్ బాబు కెరీర్ లోనే వన్ ఆఫ్ ది సూపర్ హిట్ సినిమాగా నిలిచిన స్పైడర్ సినిమాలో నటించిన ఈ బాబు అందరికీ గుర్తుండే ఉంటారు. స్పైడర్ సినిమాలో మహేష్ బాబుకు ఎంత క్రేజ్ పాపులారిటీ దక్కిందో ..అంతకు డబల్ రేంజ్ లో పేరు సంపాదించుకున్నాడు ఈ బుడ్డోడు. తనదైన స్టైల్ లో నటించి పెద్దలను సైతం భయపెట్టిన ఈ కుర్రాడి పేరు సంజయ్ . డైరెక్టర్ తనకిచ్చిన పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈ సంజయ్ సినిమా కథని ఎలా మలుపు తిప్పుతాడు అందరికీ తెలిసిందే .

ఎవరైనా మరణించినప్పుడు తన కుటుంబ సభ్యులు.. బంధువులు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపులో ఆనందాన్ని వెత్తుకునే పాత్రలో ఈ కుర్రాడు లీనమైపోయినటించాడు. ఇప్పటికీ ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి ఈ కుర్రాడు చూపులు తలుచుకుంటుంటే ఒళ్ళు వణికిపోతుంది. అలాంటి నటన కనుబరిచాడు సంజయ్ . స్పైడర్ సినిమా అనంతరం ఇతనికి కోలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. జాక్ పాట్, జాగముని ఇంకా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు..

చెన్నైలో పుట్టినటువంటి సంజయ్ కుట్టి టాకీస్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ సైతం నడుపుతున్నాడు . ఇతను చాలా రీల్స్ – డాన్స్ వీడియోస్ తో సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకొని ముందుకెళ్తున్నాడు. ఓవైపు చదువు మరోవైపు సినిమాలు అంటూ బిజీగా ఉన్నా ఈ సంజయ్ మల్టీ టాలెంటెడ్ . పాటలు కూడా చాలా బాగా పాడుతాడు అంటూ తెలుస్తుంది . డాన్స్ కూడా ఇరగదీస్తాడట. అంతేకాదు ఇప్పుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్న ఈ సంజయ్ పెద్దయ్యాక హీరోగా అవ్వాలంటూ ఆశపడుతున్నారట . చూద్దాం మరి ఈ బుడ్డోడి కోరిక నెరవేడుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news