Newsవిడాకుల తరువాత చైతన్య లైఫ్ లో ఫస్ట్ సెలబ్రేషన్.. ఎంత హ్యాపీగా...

విడాకుల తరువాత చైతన్య లైఫ్ లో ఫస్ట్ సెలబ్రేషన్.. ఎంత హ్యాపీగా ఉన్నాడో ఈ మెగా మాజీ అల్లుడు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారికకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాగబాబు ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొన్ని సినిమాలు చేసింది. అయితే హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది . ఈ క్రమంలోనే మంచి ట్రెడిషనల్ ఫ్యామిలీగా జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది . వీళ్ళ పెళ్లి టైంలో నడిచిన హంగామా అంతా ఇంత కాదు . కొన్ని కోట్లు ఖర్చుపెట్టి మరి నిహారిక పెళ్ళిని అంగరంగ వైభవంగా గ్రాండ్గా జరిపించారు నాగబాబు.

అయితే వీళ్ళు పెళ్లి చేసుకున్న కొంతకాలం బాగానే ఉన్నా.. ఆ తర్వాత వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . ఇలాంటి క్రమంలోనే విడాకుల తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డేను చాలా సింపుల్ అండ్ స్టైలిష్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు జొన్నలగడ్డ చైతన్య. జులై 27 జొన్నలగడ్డ చైతన్య పుట్టినరోజు . ఈ క్రమంలోనే ఆయన చాలా స్టైలిష్ గా ఉండే లుక్ ను షేర్ చేస్తూ అభిమానులతో మళ్ళీ టచ్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు .

ఈ క్రమంలోనే విడాకుల తర్వాత బాగా డిప్రెషన్ కి గురైన చైతన్య ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కాగా వైట్ కలర్ ఫ్యాంట్ బ్లాక్ కలర్ షర్ట్లు లో చాలా స్టైలిష్ గా హ్యాండ్ సమ్ లుక్స్ లో కనిపించాడు జొన్నలగడ్డ చైతన్య. ఈ క్రమంలోనే నిహారిక మంచి భర్తను మిస్ చేసుకుందని చెప్తుంటే.. మరి కొందరు ఇప్పటికైనా ఆ ఫ్యామిలీ నుండి బయటకు వచ్చావ్..యూ ఆర్ లక్కీ ఫెలో ఇకనైనా జీవితం బాగుపడుతుంది అంటూ చైతన్యకు సపోర్ట్ చేస్తున్నారు. దీంతో జొన్నలగడ్డ చైతన్య చేసిన పోస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news