Newsదిల్‌రాజు కొడుకు కోసం శ్రీలీల ఏం చేసిందో చూశారా.. బర్త్ డే...

దిల్‌రాజు కొడుకు కోసం శ్రీలీల ఏం చేసిందో చూశారా.. బర్త్ డే వేడుకలో ఆమె స్పెషల్ అట్రాక్షన్..కన్నడ పిల్ల అనిపించేసిందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా పాపులారిటీ సంపాదించుకున్న దిల్ రాజు కుమారుడు మొదటి పుట్టిన రోజు వేడుకలు గురువారం సాయంత్రం హైదరాబాదులో గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగాయి . దీనికి సంబంధించిన ఫొటోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . బిగ్ స్టార్స్ నుంచి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రిలో ఎదుగుతున్న హీరోలు హీరోయిన్ల వరకు అందర్నీ స్పెషల్గా ఇన్వైట్ చేసి తన కొడుకు పుట్టినరోజు మరింత స్పెషల్ గా మలుచుకున్నాడు దిల్ రాజు.

బ్లాక్ అండ్ వైట్ సూట్ లో దిల్ రాజు కొడుకుకి తగ్గ కాస్ట్యూమ్స్ వేసి అందరినీ అలరించారు . అంతేకాదు దిల్ రాజు భార్య తేజస్విని మోడ్రన్ డ్రెస్ లో మెరిసి హీరోయిన్ కి మించిపోయే అందం ఉంది అంటూ కామెంట్స్ దక్కించుకుంది. కాగ దిల్ రాజు మూడేళ్ల క్రితం తేజస్విని అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి గత ఏడాది కుమారుడు అన్వై జన్మించారు. తాజాగా గురువారం దిల్ రాజుకుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలు చాలా గ్రాండ్గా నిర్వహించారు తల్లిదండ్రులు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఉండే ప్రతి సెలబ్రిటీ వచ్చి దిల్ రాజు కొడుకుని ఆశీర్వదించారు . అయితే పార్టీకి ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చిన ..స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది శ్రీ లీల . చాలా మంది హీరోయిన్స్ వచ్చినా హీరోలు వచ్చిన శ్రీలీల వైపే కెమెరాలన్నీ చూస్తూ ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ రెడ్ ఫ్రాక్ లో శ్రీ లీల చాలా అట్రాక్టివ్ గా కనిపించింది . చాలా సింపుల్ లుక్ లో మెరిసిన శ్రీలీల దిల్ రాజు కొడుకుతో ఆడి పాడిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

అంతేకాదు దిల్ రాజు కొడుకు ఎవరి దగ్గరికి వెళ్ళనే వెళ్ళలేదట . కానీ శ్రీలీల పిలిస్తే మాత్రం నవ్వుకుంటూ వెళ్లిపోయాడట. ఆమె వద్దకు వెళ్లి తెగ ఆడుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు శ్రీ లీల ఫ్యాన్స్ . అంతేకాదు క్యూట్ గా చూడగానే అట్రాక్టివ్ గా ఉండే ఫేస్ కట్ కు దిల్ రాజు కొడుకు కూడా అట్రాక్ట్ అయిపోయాడు అని.. అందుకే ఆమె వద్దకు వెళ్లి ఆడుకున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు బాబు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసి రకరకాల బొమ్మలను తీసుకెళ్లిందట . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news