Moviesదేవర సినిమా కి మహేశ్ బాబు బిగ్ హెల్ప్.. కొరటాల మైండ్...

దేవర సినిమా కి మహేశ్ బాబు బిగ్ హెల్ప్.. కొరటాల మైండ్ బ్లోయింగ్ ప్లాన్ కి ఫ్యాన్స్ ఫిదా..!!

ఎస్ ఇది నిజంగా అభిమానులకి పూనకాలు తెప్పించే న్యూస్ అని చెప్పాలి . యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న తారక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . కొరటాల శివ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది . సినిమాలో మొదటి హీరోయిన్ గా జాన్వి కపూర్ ని చూస్ చేసుకున్నారు కొరటాల శివ .

అయితే సెకండ్ హీరోయిన్ గా రష్మిక మందన్నా.. లేదా మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి . ఇదే క్రమంలో రీసెంట్గా ..ఈ సినిమాలో సాయి పల్లవి మరో హీరోయిన్గా నటిస్తుంది అంటూ వార్తలు వైరల్ అవ్వడంతో చిత్ర బృందం అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది . ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది .

దేవర సినిమాకు మాట సాయం చేయనున్నాడట మహేష్ బాబు . గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే . కాగా మళ్లీ ఇన్నాళ్లకు మహేష్ ఎన్టీఆర్ కోసం మాట సాయం చేయనున్నారట. ఈ సినిమా స్టార్టింగ్లో మహేష్ మాట అందించడానికి సై అన్నారట. ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం అభిమానులకి పూనకాలు కన్ఫర్మ్ అనే చెప్పాలి. మొత్తంగా దేవర సినిమా హిట్ అవ్వడానికి కొరటాల అన్ని ప్లాన్స్ వేస్తున్నాడు. చూద్దాం ఈ స్ట్రాటజీలు ఎలా వర్క్ అవుట్ అవుతాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news