Moviesits Official: పెళ్లి పీటలు ఎక్కబోతున్న తమన్నా.. సైలెంట్ షాకిచ్చిన మిల్కి...

its Official: పెళ్లి పీటలు ఎక్కబోతున్న తమన్నా.. సైలెంట్ షాకిచ్చిన మిల్కి బ్యూటీ..!!

మిల్కీ బ్యూటీ తమన్న పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఇన్నాళ్లు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్న ప్రేమాయణం నడుపుతుందా..? లేదా..? కేవలం ఇదంతా ఎంజాయ్మెంటేనా అంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు వైరల్ గా మారాయి . అయితే ఫస్ట్ టైం తన ప్రేమ విషయంపై ఓపెన్ గా స్పందించింది తమన్నా. లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ వర్మ తో తన ప్రేమ నిజమే అంటూ ఓపెన్ అప్ అయింది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తమన్నా పేరు వైరల్ గా మారింది . ఆమె మాట్లాడుతూ..” విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నాను అన్న విషయం నిజమే.. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో మా ప్రేమ మొదలైంది. కేవలం సహనటుడు గానే నాకు నచ్చలేదు.. ఓ మనిషిగా కూడా నచ్చాడు.. నేను చాలా మంది హీరోలతో వర్క్ చేశాను.. కానీ విజయ్ వర్మ చాలా ప్రత్యేకం. నాకు రక్షణగా నిలబడతాడని నమ్మకం ఉంది. మాది ఆర్గానిక్ బంధం . నన్ను దెబ్బతీయాలని చూసేవారి నుండి రక్షిస్తాడు నా విజయ్. నేను ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అందులోకి విజయవర్మ వచ్చాడు . ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటే అదేనా అందమైన ప్రదేశం” అంటూ తమన్న తన మనసులోని మాటను బయట పెట్టేసింది .

ఈ క్రమంలోనే డేటింగ్ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సైలెంట్ గానే తమన్న ఇంత షాక్ ఇచ్చేసింది ఏంట్రా బాబు అంటూ జనాలు ఫుల్ షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news