Moviesఆ క్రేజీ "హిట్‌" సిరీస్‌లోకి బాలయ్య.. నందమూరి అభిమానులకి ఎగిరి గంతులేసే...

ఆ క్రేజీ “హిట్‌” సిరీస్‌లోకి బాలయ్య.. నందమూరి అభిమానులకి ఎగిరి గంతులేసే న్యూస్ ఇది..!!

టాలీవుడ్ నటసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య వరుస సినిమాలకు కమిట్ అవుతూ.. జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఒక సినిమాని అనౌన్స్ చేసి ఆ సినిమా షూట్ కంప్లీట్ చేస్తూ నందమూరి అభిమానుల్లో కొత్త ఊపులు తీసుకొస్తున్నారు. కాగా జూన్ 10 న నందమూరి నటసింహం బాలయ్య పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన టైటిల్, టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.

ప్రెసెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలయ్య ఎన్.బి.కె 108 అనే సినిమాలో సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి “లాల్ భగవంత్ సింగ్” అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది . బాలయ్య పుట్టినరోజు నాడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ – అలాగే టైటిల్ రివీల్ చేయనున్నారట . ఇదే క్రమంలో బాలయ్య నెక్స్ట్ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది .

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ రివిల్ చేయనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే ముచ్చటగా మూడో అప్డేట్ కూడా బాలయ్య ఇవ్వబోతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఇప్పటికే హిట్ యూనివర్స్ నుంచి రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. తొలి చిత్రంలో విశ్వక్సేన్ హీరోగా నటించిన మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ చూపించాడు.. హిట్ 2 లో అడవిశేష్ నటించి మెప్పించాడు.. హిట్ 3 లో నాని నటిస్తున్నారు అంటూ ఆల్రెడీ అర్థమైపోయింది .

ఈ క్రమంలోనే నాలుగో సిరీస్ కూడా ఉందని ..ఆ సిరీస్ లో ఓ పెద్ద హీరో నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా ద్వార బాలయ్య లోని ఓ సరికొత్త యాంగిల్ ని బయట పెట్టడానికి డైరెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారుట . దర్శకుడు శైలేష్ కొలను ఇప్పటికే హిట్ ఫోర్ సినిమా సిరీస్ కథను బాలయ్య వివరించగా ఆయన ఇంప్రెస్ అయినట్లు కూడా తెలుస్తుంది. త్వరలోనే దీని పై అఫిషియల్ ప్రకటన రానుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news