Movies"పోకిరి" సినిమాని వదులుకున్న ఆ అన్ లక్కి హీరో ఎవరో...

“పోకిరి” సినిమాని వదులుకున్న ఆ అన్ లక్కి హీరో ఎవరో తెలుసా..? ఏం దరిద్రం రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం. రీజన్ ఏదైనా కావచ్చు .. మనం చేయాల్సిన సినిమా మిస్ చేసుకుని.. మరో హీరో ఆ సినిమా తీస్తే.. హిట్ కొట్టి కెరియర్ లో సెటిల్ అయిపోతే.. లైఫ్ లో దశతిరిగిపోతే ..ఆ బాధ వర్ణాతితం. అలాంటి బాధలు ఎన్నోసార్లు అనుభవించాడు మాస్ మహారాజా హీరో రవితేజ . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన రవితేజ మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి .. ఆ తర్వాత చిన్నచితక పాత్రలు చేసుకుంటూ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకొని ..ఆ తర్వాత హీరోగా.. ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు.

ప్రెసెంట్ మాస్ మహారాజా గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న రవితేజ పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకీంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు రవితేజ ఏ విధంగా ఉన్నాడో మనందరికీ తెలిసిందే. ఏ సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్.. స్టార్ హీరోలు కూడా రవితేజను అప్రిషియేట్ చేసే స్థాయికి వెళ్లిపోయాడు . అయితే ఈ మాస్ హీరో గతంలో ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పోకిరి సినిమాను మిస్ చేసుకుని తప్పు చేశాడు అంటూ జనాలు మండిపడుతున్నారు.

ఎస్ ..పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కి 28 ఏప్రిల్ 2006న రిలీజ్ అయిన పోకిరి సినిమా కథను మొదటి వినిపించింది రవితేజకే అట . అయితే రవితేజ ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేశాడని ఆ తర్వాత ఈ పాత్ర కోసం చాలామంది హీరోలను అప్రోచ్ అయిన ఫైనల్లి మహేష్ బాబు సెట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అప్పటివరకు క్లాస్ హీరోగా ఉన్న మహేష్ ని మాస్ హీరోగా కూడా మార్చేసి.. మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునేలా చేసింది పోకిరి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇలా బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుని బంగారం భవిష్యత్తుకి బేకులు వేసుకున్నాడు రవితేజ. ఇప్పుడు వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్నాడు ఈ హీరో..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news