Moviesకధ నచ్చిన బ్లాక్ బస్టర్ "ఫిదా" సినిమాను.. రిజెక్ట్ చేసిన ఆ...

కధ నచ్చిన బ్లాక్ బస్టర్ “ఫిదా” సినిమాను.. రిజెక్ట్ చేసిన ఆ తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని మూవీస్ చాలా కూల్ అండ్ క్లాస్ గా ఉంటాయి . ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. టీవీలో వచ్చిన.. పెన్ డ్రైవ్ లో వేసుకుని చూసిన పదేపదే చూడాలి అనిపిస్తుంది . అలాంటి ఓ సినిమానే ఫిదా. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు . ఆయన తెలుగులో మంచి క్రియేట్ ఉండడమే కాకుండా ఫాలోయింగ్ సైతం ఎక్కువే.

ఫీల్ గుడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శేఖర్ కమ్ముల కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఫిదా . మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ సాయి పల్లవి నటించింది. ఈ సినిమా ద్వారా సాయి పల్లవి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి .. ఆ తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది .

అయితే శేఖర్ కమ్ముల ఈ సినిమాలో మొదట అనుకున్న హీరో వరుణ్ కాదట .. మహేష్ బాబు అట. హీరోయిన్ కూడా సాయి పల్లవి కాదు దీపికా పదుకొనే. అయితే వాళ్లు ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత అలా అలా ఈ పాత్రలు వరుణ్ కి సాయి పల్లవి కి వెళ్ళాయి. ఇద్దరూ ఆ పాత్రల్లో ఎంత చక్కగా నటించి జీవించేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

దీంతో మహేష్ బాబు కథ చెప్పిన ఇంప్రెస్ అయిన ఈ సినిమా చేయకపోవడానికి కారణం ఆయన స్టార్ట్డం అని తెలుస్తుంది . స్టార్ హీరో ఇలాంటి సినిమా తీస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా ..? అన్న కోణంలో ఆలోచించి ఈ సినిమాను వదులుకున్నారట . దీంతో మహేష్ బాబు మంచి సినిమాను వదులుకున్నాడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news