MoviesTL రివ్యూ: బిచ్చ‌గాడు 2… అంతా బాగున్నా అక్క‌డే దెబ్బ‌ప‌డిందిగా…

TL రివ్యూ: బిచ్చ‌గాడు 2… అంతా బాగున్నా అక్క‌డే దెబ్బ‌ప‌డిందిగా…

టైటిల్‌: బిచ్చ‌గాడు 2
నటీనటులు: విజయ్ ఆంటోని, కావ్య థాపర్, యోగి బాబు, రాధా రవి, వైజి మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, దేవ్ గిల్ త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: ఓం నారాయణ్
మ్యూజిక్‌: విజయ్ ఆంటోని
నిర్మాతలు: ఫాతిమా విజయ్ ఆంటోని
ఎడిటింగ్ & దర్శక‌త్వం : విజయ్ ఆంటోని
రిలీజ్ డేట్‌ : మే 19, 2023

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన సినిమా బిచ్చగాడు సినిమా ఆరేళ్ల క్రితం తెలుగులో రిలీజ్ అయ్యి పెద్ద సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. తెలుగులో ఏ మాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి ఏకంగా రు. 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌తో పాటు 55 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తెలుగులో లేట్ రిలీజ్ అయిన కేంద్రాల్లోనూ 100 రోజులు ఆడింది. ఇక ఇప్పుడు బిచ్చ‌గాడు 2 వ‌చ్చింది. బిచ్చ‌గాడు మానియాతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ రోజు రిలీజ్ అయిన బిచ్చ‌గాడు 2 బిచ్చ‌గాడు మ్యాజిక్ క్రియేట్ చేసిందో లేదో TL స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
విజి. గ్రూప్ వ్యాపార సంస్థ‌ల అధినేత విజ‌య్ గురుమూర్తి ( విజ‌య్ ఆంటోనీ) ఆస్తి కొట్టేయాల‌ని స్నేహితుడు అర‌వింద్ ( దేవ్ గిల్‌) అదే సంస్థ‌లో ప‌నిచేస్తోన్న కొంద‌రితో క‌లిసి కుట్ర ప‌న్నుతాడు. ఈ క్ర‌మంలోనే విజ‌య్ మెద‌డు మార్చాల‌ని రు. 140 కోట్లు ఖ‌ర్చు చేసి ఓ బిచ్చ‌గాడు స‌త్య ( విజ‌య్ ఆంటోనీ) మొద‌డును గురుమూర్తి త‌ల‌లో ఆమ‌ర్చుతారు. స‌త్య‌ది మ‌రో స్టోరీ. చిన్న‌ప్పుడు త‌ల్లిదండ్రులు చ‌నిపోతారు. ఓ చెల్లి కూడా ఉంటుంది. త‌ప్పిపోయిన చెల్లిని వెతుకున్న క్ర‌మంలో అర‌వింద్ చేసిన కుట్ర కు బ‌లైపోతాడు. మెద‌డు మార్చాకా ? ఏం జ‌రిగింది ? అత‌డిని అడ్డం పెట్టుకుని అర‌వింద్ విజ‌య్ ఆస్తిని కొట్టేశాడా ? స‌త్య అర‌వింద్‌కు ఎలా ? బుద్ధి చెప్పాడు ? అత‌డి చెల్లి దొరికిందా ? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా.

విశ్లేష‌ణ :
ఈ సినిమా బిచ్చ‌గాడికి కొన‌సాగింపే అయినా ఆ క‌థ‌కు, ఈ క‌థ‌కు ఎక్క‌డా పోలిక లేదు. తొలిపార్ట్ అమ్మ సెంటిమెంట్‌తో కొన‌సాగితే.. ఇది చెల్లి సెంటిమెంట్‌తో కొన‌సాగింది. క‌థ‌లో చాలా లోపాలు ఉన్నాయి. చెల్లి సెంటిమెంట్ హ‌త్తుకోలేదు. మొద‌డు మార్చ‌డం రామ్ ఇస్మార్ట్ శంక‌ర్‌ను గుర్తు చేస్తుంది. సినిమా స్టార్టింగ్‌లో వ‌చ్చే బ్రెయిన్ మార్పు అనేది చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. స‌త్య మొద‌డుతో విజ‌య్ గురుమూర్తి పాత్ర‌లో ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి క‌థ‌లో వేగం మొద‌ల‌వుతుంది. అర‌వింద్‌ను, అత‌డి గ్యాంగ్‌ను స‌త్య చంప‌డంతో వ‌చ్చే ఫ‌స్టాఫ్ ఎండింగ్ ట్విస్ట్ ఆక‌ట్టుకుంటుంది.

ఫ‌స్టాఫ్ వ‌ర‌కు మంచి స్క్రీన్ ప్లేతో సాగిన క‌థ‌.. సెకండాఫ్ నుంచి ట్రాక్ త‌ప్పుతుంది. ఓ వైపు డ‌బ్బు, ప‌ర‌ప‌తి ఉన్నా కూడా స‌త్య చెల్లిని వెతికేందుకు మ‌ళ్లీ బిచ్చ‌గాడి వేషం క‌ట్ట‌డం సిల్లీగా ఉంది. మ‌ధ్య‌లో బోరింగ్ సీన్లు ఉన్నా స‌త్య‌కు ఎప్పుడు అయితే రాజ‌కీయ ప‌ర‌ప‌తి వ‌స్తుందో మ‌ళ్లీ అప్ప‌టి నుంచి క‌థ మ‌ళ్లీ వేగం పుంజుకుంటుంది. క్లైమాక్స్ ముందు వ‌చ్చే కోర్టు రూం డ్రామా రొటీన్‌గా ఉంది. క్లైమాక్స్ మాత్రం భావోద్వేగంగా ఉంటుంది.

విజ‌య్ ఆంటోనీ రెండు పాత్ర‌ల్లోనూ డిఫ‌రెంట్‌గా త‌న‌దైన స్టైల్లో చేసుకుంటూ వెళ్లిపోయాడు. క్లైమాక్స్‌లో భావేద్వేగ న‌ట‌న‌తో కంట త‌డిపెట్టిస్తాడు. ద‌ర్శ‌కుడిగా విజ‌య్‌కు ఇది తొలి సినిమా అయినా ఆ త‌డ‌బాటు లేదు. మంచి అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిలా సినిమాను తెర‌కెక్కించాడు. క‌థ‌లో లోపాలు ఉన్నా మాస్ ఎలిమెంట్స్‌ను ప్ర‌జెంట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. నేప‌థ్య సంగీతంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. పాట‌లు పూర్తిగా తేలిపోయాయి. ఒక్క‌టి గుర్తుండ‌దు. కావ్య థాపర్ అందంగా ఉంది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. నిర్మాణ విలువ‌లు అదిరిపోయాయి.

ఫైన‌ల్‌గా…
మాస్ మెచ్చే బిచ్చ‌గాడు 2

బిచ్చ‌గాడు 2 రేటింగ్‌: 2. 25 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news