Moviesఉపాసన మేడం ప‌రువు తీయొద్దు ప్లీజ్‌... మెగా ఫ్యాన్స్ రికెస్ట్ ఇదే...!

ఉపాసన మేడం ప‌రువు తీయొద్దు ప్లీజ్‌… మెగా ఫ్యాన్స్ రికెస్ట్ ఇదే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఏ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే. మెగా కుటుంబం నుంచి చాలామంది హీరోలు సినిమాల్లోకి వచ్చినా సక్సెస్ సాధించడానికి ఇదే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్య ఉపాసనకు కూడా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఎంతో ఉంది. ఉపాసన చిరంజీవిలా ఎన్నో సేవా కార్యక్రమాలు చెస్తూ అభిమానులకు ఎంతగానో దగ్గరవుతున్నారు.

అయితే ఉపాసన కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్న మాటలు అభిమానులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఉపాసన మాట్లాడిన మాటల్లో తప్పేం లేకపోయినా ఆ మాటల విషయంలో నెగిటివ్ కామెంట్లు వస్తుండటం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. చరణ్ ఉపాసన ఆలస్యంగా పిల్లల్ని కంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతే పిల్లల్ని కనాలని భావించడంతో ఉపాసన, చరణ్ పెళ్లైన పదేళ్ల తర్వాత పిల్లల్ని కంటున్నారు.

అయితే అటు ఉపాసనకు, ఇటు చరణ్‌కు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కొన్ని తరాల పాటు కూర్చుని తిన్నా తరగని స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. అలాంటి ఉపాసన చరణ్ దంపతులు సంపాదన కోసం పిల్లల్ని ఆలస్యంగా కనడం నమ్మశక్యంగా లేదు. కొన్నిరోజుల క్రితం ఎగ్స్ ను పెళ్లి సమయంలోనే ఫ్రీజ్ చేశామని ఉపాసన షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఉపాసన గర్భం గురించి ఎన్నో కథనాలు వినిపించాయి. ఎగ్స్ ను ఫ్రీజ్ చేశామని ఉపాసన చేసిన కామెంట్లు కొత్త చర్చకు తెర లేపాయి.

ఉపాసన కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పకపోవడమే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఒక్కోసారి మెగా ఫ్యామిలీ ప‌రువు తీసేలా ఉన్నాయని మెగాభిమానులు వాపోతున్నారు. ఉపాసన ఇంటర్వ్యూలలో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. త్వరలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఇకనైనా నెగిటివ్ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని ఉపాసన మారతారేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news