Moviesతాత డైరెక్షన్‌లో.. జూనియర్ ఎన్టీఆర్ న‌టించిన సినిమాకు ఇంత స్పెషాలిటీ ఉందా...!

తాత డైరెక్షన్‌లో.. జూనియర్ ఎన్టీఆర్ న‌టించిన సినిమాకు ఇంత స్పెషాలిటీ ఉందా…!

నందమూరి తారకరామారావు పేరు ఎత్తితే తెలుగు జాతి గర్వంతో మీసం మెలేస్తుంది. నటుడిగా ఆయన పోషించినన్ని పాత్రలు , రాజకీయ నాయకుడిగా ఆయన సృష్టించిన చరిత్రని తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోలేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఆయన అందించినన్ని సేవలు ఎవ్వరు అందించలేదు. త‌న రాజ్యం లో ప్రతీ పేదవాడు ఎంతో సంతోషంగా బ‌త‌కాల‌న్న‌దే ఎన్టీఆర్ సిద్ధాంతం, ఇప్పటికీ నడుస్తున్న ప్రభుత్వాలకు ఎన్టీఆర్ పాలన, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఒక దిక్సూచి.

ఎన్టీఆర్ నటుడిగా జానపధం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ప్రతి దానిలో ఆయనకి తిరుగు లేదు. కేవలం నటుడు గానే కాదు రైటర్‌గా, ఎడిటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు కళామతల్లికి ఎన్నో సేవలు అందించారు. అలా దర్శకుడిగా ఎన్నో సినిమాలను తెరకెక్కించిన ఎన్టీఆర్.. తన న‌ట‌ వారసులు అయిన బాలకృష్ణ, హరికృష్ణలను కూడా డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

అలాగే అయ‌న మ‌న‌వ‌డు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా రామారావు డైరెక్ట్ చేశారు. నటుడిగా తారక్ కి అదే మొదటి సినిమా కావడం మ‌రో విశేషం. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయం వైపు వెళ్లిన ఎన్టీఆర్.. త‌ర్వాత దాదాపు 7 ఏళ్ళ గ్యాప్ తరువాత కమ్‌బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్, ఎడిటింగ్, నిర్మాత, నటుడు.. అంతా తానే అయ్యి సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ విశ్వామిత్ర, రావణుడిగా రెండు పాత్రలో కనిపించారు. బాలకృష్ణ కూడా సత్య హరిశ్చంద్ర మరియు దుశ్యంత పాత్రలో డ్యూయల్ రోల్లో న‌టించాడు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర అయిన ప్రిన్స్ ‘భారత’ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. మొదటి సినిమాని తాతతో కలిసి షేర్ చేసుకున్న తారక్.. ఇప్పుడు ఆయన లెగసీని మరో తరం ముందుకు తీసుకు వెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news