Moviesటాలెంటెడ్ హీరోతో పెళ్ళి కి రెడీ అయిన "చిరుత" హీరోయిన్.. ...

టాలెంటెడ్ హీరోతో పెళ్ళి కి రెడీ అయిన “చిరుత” హీరోయిన్.. అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే ..!!

నేహా శర్మ.. ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు . అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత సినిమాతో హీరోయిన్గా పరిచయమైన అందాల ముద్దుగుమ్మ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తన పేరు కన్న మొదటి సినిమా క్రేజ్ తోనే పాపులారిటీ సంపాదించుకున్న నేహా శర్మ.. ఇండస్ట్రీలో చేసింది చాలా తక్కువ అంటే చాలా తక్కువ సినిమాలు. అయినా కానీ సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో క్రేజ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది .

దానికి మెయిన్ రీజన్ నేహ శర్మ చేసే హాట్ ఫోటో షూట్ అనే చెప్పాలి . రీసెంట్గా ఆమె నటించిన సినిమా” జోగిరా సారా రారా “. ఈ సినిమా మే 12న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమాలో హీరో నవాజుద్దీన్ సిద్ధికి తో తెగ ప్రమోషన్స్ చేస్తుంది నేహా శర్మ . అంతేనా ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ సందర్భంగా భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మూవీ టీం ఏ అవకాశాన్ని వదలట్లేదు .

ఈ క్రమంలోనే టీజర్ రోజున నవాజ్ – నేహా ఏకంగా స్కూటీలో కలిసి రావడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ఈ సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్న నేహా నవాజ్ ప్రేమలో పడ్డారు అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . వీరిప్రవర్తనే వాళ్ళ పెళ్లి పుకార్లకు దారితీస్తుంది. మీ ఇద్దరి మధ్య అంత మంచి కెమిస్ట్రీ బాగుంటే పెళ్లి చేసుకోవచ్చుగా..? అంటూ పలువురు నెటిజన్లు సలహా ఇస్తున్నారు.. అంతేకాదు వీళ్ళ మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే కచ్చితంగా త్వరలోనే ఆ పని చేసే విధంగా ఉన్నారు అంటూ కూడా జనాలు కౌంటర్స్ వేస్తున్నారు. ఈ క్రమంలోని నేహా శర్మ పెళ్లి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news