Moviesనరేష్-పవిత్ర ల "మ‌ళ్లీ పెళ్లి" 3 డేస్‌ క‌లెక్ష‌న్స్.. ఆఖరికి పోస్టర్...

నరేష్-పవిత్ర ల “మ‌ళ్లీ పెళ్లి” 3 డేస్‌ క‌లెక్ష‌న్స్.. ఆఖరికి పోస్టర్ ఖర్చులు కూడా రాలేదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న నరేష్ – క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ కలిసి జంటగా నటించిన సినిమా “మళ్లీ పెళ్లి”. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకుంది. మరీ ముఖ్యంగా ఇది మొత్తం నరేష్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన స్టోరీ కావడంతో ఆల్రెడీ ఆయన జీవితంలో జరిగిన వ్యవహారాలు అన్ని జనాలకు తెలియడంతో .. ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు జనాలు.

మరీ ముఖ్యంగా నరేష్ పవిత్రల రొమాన్స్ చూసి భరించలేకపోయాం అంటూ ఈ సినిమాకి వెళ్లి వచ్చిన జనాలు హ్యూజ్ రేంజ్ లో వాళ్ళ ప్రేమను ట్రోలింగ్ చేశారు. ఈ క్రమంలోనే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందో తెలుసుకొని జనాలు షాక్ అయిపోతున్నారు . “మళ్ళీ పెళ్లి” సినిమాకి సంబంధించిన లేటెస్ట్ కలెక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం 16 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించారట. ఫైన్నల్లీ సినిమా రిలీజ్ అయ్యాక పెట్టిన దానికి పావు వంతూ కూడా రాలేదు అంటూ తెలుస్తుంది . టోటల్గా 16 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా మొదటిరోజు 40 లక్షల గ్రాస్ ను వసూలు చేసినట్లు ట్రెడ్ వర్గాలు చెప్తున్నాయి. రెండవ రోజు దారుణాతి దారుణంగా 15 లక్షలకు అసంఖ్య పడిపోయింది . మూడవరోజు మరీ దారుణంగా ఆ సంఖ్య 12 లక్షలకు పడిపోయిన్నట్లు తెలుస్తుంది . అలా మూడు రోజులకు కలిపి మొత్తంగా 67 లక్షల సొంతం చేసుకుంది “మళ్ళీ పెళ్లి “సినిమా . పెట్టిన దానికి కనీసం పావు వంతు కూడా రాకుండా మేకర్స్ ను తీవ్ర నష్టాల్లోకి ముంచేసింది ఈ సినిమా . దీంతో సోషల్ మీడియాలో “మళ్లీ పెళ్లి” సినిమా టాక్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news