Moviesక‌న్నాంబ‌కు ఉన్న ఆ బ్యాడ్ హ్యాబిటే.. సావిత్రికి కలిసి వచ్చిందా..? ...

క‌న్నాంబ‌కు ఉన్న ఆ బ్యాడ్ హ్యాబిటే.. సావిత్రికి కలిసి వచ్చిందా..? మహానటిగా మార్చేసిందా..?

ఓల్డ్ మూవీల్లో క‌న్నాంబ అంటే తెలియ‌నివారు ఉండ‌రు. హీరోయిన్‌గా, క‌థా ర‌చ‌యిత‌గా, గాయ‌కురాలిగా ఆమె 24 ఫ్రేమ్స్‌లోనూ అందెవేసిన చేయి. అయితే.. ప్ర‌తి ఒక్క‌రిలోనూ.. ఏదో ఒక వీక్‌నెస్ పెడ‌తాడు క‌దా.. బ్ర‌హ్మ‌. అలానే క‌న్నాంబ‌కు కూడా వీక్‌నెస్ ఉండేది. ఆమె త‌ర‌చుగా తాంబూలం వేసుకునేవారు. మ‌గ‌వారు సిగ‌రెట్లు తాగిన‌ట్టుగా.. క‌న్నాంబ ఆకు వ‌క్క సున్నం త‌న వెంటే తెచ్చుకునేవారు.

అప్ప‌ట్లో ప్ర‌జ‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఇవి త‌మ బోడ్లోనే పెట్టుకుని తిరిగేవారు. క‌న్నాంబ కూడా అంతే. అయితే.. ఆమె వెండితో ఒక భ‌రిణ చేయించుకుని.. దానిలో ఆకులు.. వ‌క్క‌.. సున్నం దాచుకునేవారు. త‌ను ఎక్క‌డు న్నా.. త‌న‌తో పాటు అవి ఉండాల్సిందే. నిజానికి ఇప్ప‌టిలా.. ఒక సినిమా షెడ్యూల్ వ‌రకు న‌టులు కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో అప్ప‌ట్లో చేసేవారు కాదు. అంద‌రూ కూడా ఉద్యోగాలు చేసేవారు.

ఒక స్టూడియోలో ఉద్యోగానికి కుదిరితే.. అక్క‌డే 10 నుంచి 15 సంవ‌త్స‌రాలు చేసిన ప‌రిస్థితి ఉండేది. అలానే తొలుత క‌న్నాంబ కూడా వాహినీ స్టూడియో(ఇప్పుడు జెమెనీ వారిది)లో ప‌నిచేసేవారు. అయితే.. ఎలా అల‌వాటైందో తెలియ‌దు కానీ.. క‌న్నాంబ‌కు.. తాంబూల చ‌ర్వ‌ణం అల‌వాటైంది. దీనిని కొంద‌రు ద‌ర్శ‌కులు చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించినా.. బీఎన్ రెడ్డి, ఎల్వీ ప్ర‌సాద్ వంటిదిగ్గ‌జ ద‌ర్శ‌కుల‌కు న‌చ్చేది కాదు.

దీంతోక‌న్నాంబ‌ను ఆ అల‌వాటు మానుకోవాల‌ని సూచించేవారు. కానీ, ఆమె.. నేను కావాలంటే.. కొన్ని భ‌రించాల్సిందే.. అని తేల్చిచెప్పారు. దీంతో సావిత్రికి ఎక్కువ‌గా అవ‌కాశాలు ద‌క్కాయి. ఈ ఒక్క అల‌వాటు క‌నుక క‌న్నాంబ కు లేకుండా ఉంటే.. సావిత్రి ఎలివేట్ అయ్యేవారు కాద‌ని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news