Newsనాగ చైతన్యలో ఇంత మార్పు రావడానికి కారణం అదేనా..? దెబ్బ పడ్డందే...

నాగ చైతన్యలో ఇంత మార్పు రావడానికి కారణం అదేనా..? దెబ్బ పడ్డందే గుణం మారదా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసిన టాలీవుడ్ ఇండస్ట్రీ హీరో నాగచైతన్య పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన కస్టడీ సినిమా. మరి రెండు రోజుల్లో థియేటర్స్ లో గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం తెగ తిరిగేస్తున్నాడు చైతన్య. అంతేకాదు ఇంటర్వ్యూలలో అడిగే పర్సనల్ క్వశచన్స్ కి కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఓపెన్గా ఆన్సర్ చేస్తున్నాడు .

కాగా ఇదే క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో జరిగిన “కస్టడి” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య స్పీచ్ చాలా హైలెట్ గా మారింది . నాగచైతన్య మాట్లాడుతూ..” తమిళ అభిమానుల నుండి ఈ స్థాయి రెస్పాన్స్ నిజంగా నేను ఊహించలేదు. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ధ్యాంక్స్ ..కస్టడి చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు .ఈ సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తారని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను”అంటూ నాగచైతన్య తమిళ్ లో మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది .

అంతేకాదు హీరోయిన్ కృతి గురించి మాట్లాడుతూ ..”ఆమె నాకన్నా సీనియర్ తమిళ ఇండస్ట్రీలో ఎప్పుడో అడుగుపెట్టేసింది “అంటూ సరదాగా కాసేపు నవ్వించారు . అయితే చై ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఏ సినిమాకి ఇంత కష్ట పడలేదు.. ఈ సినిమా కోసం తెగ తాపత్రయ పడుతున్నాడు.. ఓపెన్ గా మాట్లాడుతున్నాడు.. దీంతో నాగచైతన్య లో ఇంత మార్పా..? వరుస ఫ్లాప్స్ పడితే కానీ..సార్ రూట్ లోకి రాడా..? అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే చైతన్య సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత తాపత్రయ పడుతూ కష్టపడుతున్నారు . మరి సినిమాల్లో కంటెంట్ ..మేటర్ లేకపోతే సినిమా హిట్ అవుతుందా..? లేదా ..? అన్నది ప్రశ్నకంగా మారింది . అది తెలియాలంటే మే 12వ తేదీ వరకు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news