Moviesఎన్టీఆర్ అంత ఫిట్ గా ఉండటానికి కారణం అదేనా..? ఫుడ్ డైట్...

ఎన్టీఆర్ అంత ఫిట్ గా ఉండటానికి కారణం అదేనా..? ఫుడ్ డైట్ చూస్తే మతులుపోవాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ స్థానంలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న తారక్..ప్రెసెంట్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు . కళ్ళు మూసుకొని ఎవరడిగినా సరే టక్కున ఇదే ఆన్సర్ చెప్తారు . ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ గా ఉన్న కోటా శ్రీనివాసరావు లాంటివారే ఇండస్ట్రీకి ఎన్టీఆర్ లాంటి హీరో కావాలి అంటూ చెప్పారు . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా కొరటాల శివ డైరెక్షన్లో నటిస్తున్న ఎన్టీఆర్కి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి . అంతేకాదు ఆయన వెకేషన్ ని ఎంజాయ్ చేసిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన బాడీని ఇంత కరెక్ట్ గా ఇంత పర్ ఫెక్ట్ ఫిజిక్ ఎలా మైంటైన్ చేస్తున్నాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అయితే తారక్ వెయిట్ తగ్గినప్పటి నుంచి ఒకటే డైట్ ఫాలో అవుతున్నారని ..ఆ కారణంగానే తారక్ బాడీ అంత కరెక్ట్ పొజిషన్లో ఉంది అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు మార్నింగ్ లేవడం.. యోగ .. వర్కౌట్ ఏదో ఒకటి ఒక రెండు గంటల పాటు చేస్తారట.. ఆ తర్వాత మార్నింగ్ రాగిజావ కంపల్సరీ రెండు గ్లాసులు తాగుతారట.

ఆ తర్వాత నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ను తీసుకుంటారట . ఆ తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ను దాదాపు రెండు వరకు తారక్ తీసుకుంటారట . అంతేకాదు ఆ తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తుంది. లంచ్ లోకి రాగి సంగటి నాటుకోడి ఇష్టపడతారట. డైట్ లో ఉన్నా సరే అదే ఫుడ్ ఇంట్రెస్ట్ గా తీసుకుంటారట . అంతేకాదు ఆ తర్వాత తారక్ నైట్ డిన్నర్ కి ఓన్లీ స్ప్రౌట్స్ మాత్రమే తింటారట. మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేస్తే జ్యూస్.. ఫ్రూట్స్ తప్పిస్తే ఎక్కడ డీప్ ఫ్రై ఐటెంస్ .. ఆయిల్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ను ఎంకరేజ్ చేశారట. కేవలం తారకే కాదు లక్ష్మీ ప్రణతి కూడా ఇదే డైట్ ని ఫాలో అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు కొందరు అభిమానులు. ఈ క్రమంలోనే తారక్ కి హెల్త్ కాన్షియస్ ఎక్కువ అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్ . మరికొందరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఆయన బాడీ అంత కరెక్ట్ ఫిజిక్ లో ఉంది అంటూ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news