Moviesఅది చూసుకునే హరిష్ శంకర్ విర్రవీగుతున్నాడా..? రిపోర్టర్ కి లెఫ్ట్ అండ్...

అది చూసుకునే హరిష్ శంకర్ విర్రవీగుతున్నాడా..? రిపోర్టర్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడుగా..!!

ఈ మధ్యకాలంలో స్టార్ట్ డైరెక్టర్స్ .. ఏ విధంగా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఏదో ఒక డైరెక్టర్.. ఏదో ఒక రిపోర్టర్ ..చేత తిట్టించుకోవడం లేదా..? తిట్టడం చేస్తున్నారు .. రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న హరీష్ శంకర్ . గబ్బర్ సింగ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన హరీష్ శంకర్ .. రీసెంట్గా మలయాళీ మూవీ “2018 ” అనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు .

ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ మాట్లాడుతూ..” ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమా లాంటి సినిమాలు మన తెలుగు డైరెక్టర్లు తీయ్యగలుగుతారా..? నిర్మాతలు అంత సాహసం చేస్తారా..? అంటూ హరిశంకర్ ని ప్రశ్నించారు ” ఓ రిపోర్టర్ . ఈ క్రమంలోనే హరిశంకర్ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చారు. “ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ చూసిన ఇలాంటి ప్రశ్నలు అడిగి యూట్యూబ్లో హాట్ టాపిక్ ట్రెండ్ అవ్వాలని చూస్తున్నారు ..యూట్యూబ్లో మీరే సెన్సేషన్ అయిపోయారు. సినిమా అంటే సినిమా గానే చూడండి దాన్ని ..ఏ భాష ఏ మతం అంటూ అంట కట్టకండి ..సినిమా అనేది ఎంటర్టైన్మెంట్.. అది ఏ డైరెక్టర్ తీసిన సినిమాని ఎంటర్టైన్మెంట్ గానే తీస్తారు . ఓ డైరెక్టర్ గొప్ప మరో డైరెక్టర్ తప్పు అని ఏమీ ఉండదు. మన ఇండస్ట్రీని ఇప్పుడు ప్రపంచ దేశాలు గర్విస్తున్నాయి . అది తెలిసి కూడా మీరు నన్ను ఈ ప్రశ్న అడగడం జాలేస్తుంది” అంటూ రిపోర్టర్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు.

నిజానికి హరీష్ శంకర్ మైండ్ సెట్ ఇది కాదు .. ఒకప్పుడు హరీష్ శంకర్ కి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు ఆయన అభిమానులు . అంతేకాదు హరీష్ శంకర్ ఇంతలా రెచ్చిపోయి మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఆయన చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు . ఆ సినిమా హిట్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో స్థాయికి హరిశంకర్ ఎదిగిపోతారని ఆయన అండ చూసుకొని హరీష్ శంకర్ ఈ రేంజ్ లో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని చెప్పుకొస్తున్నారు. దీంతో హరీష్ శంకర్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news