Newsప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కెలికి కెలికి వ‌దిలిన పూన‌మ్ కౌర్‌… మ‌ళ్లీ ఫైర్...

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కెలికి కెలికి వ‌దిలిన పూన‌మ్ కౌర్‌… మ‌ళ్లీ ఫైర్ అవుతూ ట్వీట్‌…!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టిస్తోన్న సినిమాల‌లో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ఓ సెన్షేష‌న‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. హ‌రీష్ శంక‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాళ్ల కింద ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ టైటిల్ ఉంచారు. ఇలా పెట్ట‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది హీరోయిన్ పూన‌మ్‌కౌర్‌. ఇది ఖ‌చ్చితంగా భ‌గ‌త్‌సింగ్‌ను కించ‌ప‌ర‌చ‌డ‌మే అవుతుంద‌ని.. అర్జెంటుగా భ‌గ‌త్‌సింగ్ యూనియ‌న్‌కు రిపోర్టు చేయ‌మ‌ని ట్వీట్ చేసింది.

స్వతంత్ర సమరయోధులను గౌరవించలేన‌ప్పుడు కనీసం వారిని అవ‌మాన‌ప‌ర్చ‌వ‌ద్ద‌ని.. ఇది ఇగోనా ? నిర్ల‌క్ష్య‌మా ? అని కూడా ప్ర‌శ్నించింది. గ‌తంలోనూ పూన‌మ్ కౌర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్‌గా చేసుకుని సోష‌ల్ మీడియాలో పెద్ద యుద్ధ‌మే చేసింది. ప‌వ‌న్ త‌న‌ను అనేక ర‌కాలుగా వాడుకున్నాడంటూ ప‌రోక్షంగా దుమ్మెత్తి పోసింది. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ నీకేం ప‌నిపాటా లేదా ? మ‌ధ్య‌లో అన‌వ‌స‌రంగా ఎందుకు ? దూరుతున్నావ్ అంటూ మండిప‌డుతున్నారు.

కావాల‌ని అంద‌రి దృష్టి నీ మీద‌కు మ‌ళ్లాల‌నే లేనిపోని కాంట్ర‌వ‌ర్సీలు క్రియేట్ చేస్తున్నావంటూ పూన‌మ్‌ను ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు. ఏదేమైనా ప్ర‌స్తుతం పూనమ్ ట్వీట్ అయితే సోష‌ల్ మీడియాలో పిచ్చ‌పిచ్చ‌గా వైర‌ల్ అవుతోంది. ఇక ఈ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news