Newsఇండస్ట్రీలో అంత మంది హీరోలు ఉన్నా.. జనాలు ఎన్టీఆర్ నే ఇష్టపడటానికి...

ఇండస్ట్రీలో అంత మంది హీరోలు ఉన్నా.. జనాలు ఎన్టీఆర్ నే ఇష్టపడటానికి కారణం ఆ రెండు క్వాలిటీసే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు .. తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలో రాజ్యాన్ని ఏలేస్తున్నారు . అయితే అందరు హీరోల కన్నా టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలామంది జనాలకు ఇష్టం . ఆయన ను హీరోలా కాకుండా మన ఇంట్లోనే మనుషులా భావిస్తూ ఉంటారు . ఆయన పుట్టినరోజు అయితే వీళ్ళ పుట్టినరోజు అన్నట్లు ఫీలై పండగ చేసుకుంటారు . సెలబ్రేట్ చేసుకుంటారు ..కేక్ కట్ చేస్తారు ..ఫ్లెక్సీలతో ఆయన పేరును మారుమ్రోగిపోయేలా చేస్తారు .

సినిమాకి సంబంధించిన చిన్న వీడియో రిలీజ్ అయినా సరే రచ్చ రచ్చ చేస్తారు. అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తారక్ రావడానికి కారణం ఆయనలో ఉండే 2 క్వాలిటీసే అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. చిన్న స్థాయి హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి ..ఆ తర్వాత స్టార్ హీరోగా.. ఆ తర్వాత పాన్ ఇండియా హీరోగా ..ఆ తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో తన ఇమేజ్ ని రోజు రోజుకి పెంచేసుకుంటున్న తారక్ లో ఉన్న మంచితనమే ఆయన ఈ స్థాయికి నిలబెట్టింది అంటూ చెప్పుకొస్తున్నారు.

మరి ముఖ్యంగా తారక్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం లో ఒక ప్లస్ పాయింట్ అయితే.. ఎటువంటి సిచువేషన్ లోనైనా బ్యాలెన్సింగా ఆన్సర్ ఇవ్వడం తారక్ లో ఉన్న సెకండ్ గుడ్ క్వాలిటీ అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఇంతటి గొప్ప స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే తారక్ లాంటి గొప్ప నటుడు ఇండస్ట్రీలో ఉండడం మన ఇండస్ట్రీకి గర్వకారణం అంటూ మల్టీ టాలెంటెడ్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు లాంటి వారు చెప్పినప్పుడు ఆయన ముందు మనం ఎంత.. నిజంగా ఇండస్ట్రీలో తారక్ లాంటి హీరో దొరకడం మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి . త్వరలోనే తారక్ ఎన్టీఆర్ థర్టీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news