Newsకృతి శెట్టి కూడా ట్రాక్ లో పడ్డిందే.. అది పెద్దది చేస్తే...

కృతి శెట్టి కూడా ట్రాక్ లో పడ్డిందే.. అది పెద్దది చేస్తే అంత క్రేజ్ దక్కుతుందా..?

అమ్మ బాబోయ్ ..టాలీవుడ్ బేబమ్మగా పేరు సంపాదించుకున్న కృతి శెట్టిలో ఇంత టాలెంట్ ఉందా? ఇంత వైల్డ్ గా బిహేవ్ చేస్తుందా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు దానంతటకీ కారణం కృతి శెట్టి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బోల్డ్ మాటలే అంటూ తెలుస్తుంది. మనకు తెలిసిందే వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఆ తర్వాత రెండు సినిమాల్లో నటించి రెండు బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది . అయితే ఆ తర్వాత నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ డైరెక్ట్ గా కృతి శెట్టి తర్వాత నటిస్తున్న కస్టడీ సినిమా ప్రమోషన్స్లో ప్రశ్నించారు .

“మీకు ఉప్పెన సినిమా తర్వాత అలాంటి హిట్ పడలేదు.. ఆ తర్వాత ఆ హిట్టు పడింది అంటే నాగచైతన్య సినిమానే.. మళ్లీ అదే కాంబో రిపీట్ అవుతుంది ..అలాంటి బ్లాక్ బస్టర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ..? సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారా..? అంటూ ప్రశ్నించాడు . ఈ క్రమంలోని కృతి సెకండ్ కూడా ఆలోచించకుండా వైల్డ్ గా రియాక్ట్ అయింది . డైరెక్ట్ గా స్టేజి పైన నాగచైతన్యను ప్రశ్నిస్తూ “మీరు నాకు హిట్ ఇచ్చారా చైతన్య గారు..? అంటూ ప్రశ్నించింది . దీంతో నాగచైతన్య సైతం అది నీ సక్సెస్ నీ హార్డ్ వర్క్ అంటూ చెప్పుకొచ్చారు .

దీంతో కృతిశెట్టి ఆ రిపోర్టర్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తూ “సక్సెస్ ఎవరి వల్ల రాదు పోదు.. ఎవరి టాలెంట్ వాళ్ళది “అంటూ పరోక్షకంగా రిపోర్టర్ కి ఇచ్చి పడేసింది. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు ఇంటర్వ్యూలలో సైలెంట్ గా ఉండే కృతి శెట్టి ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం వైల్డ్ గా బిహేవ్ చేసిందని .. ఎవరు ఏ ప్రశ్న అడిగిన లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ సమాధానాలతోనే వాళ్లకి చెమటలు పట్టించిందని చెప్పుకొస్తున్నారు.

కృటి శెట్టి సైతం ఇండస్ట్రీలో ఎలా మాట్లాడాలి.. ఇండస్ట్రిలో నిలవాలి అంటే బోల్డ్ గా మాట్లాడాలి.. నోరు పెద్దది చేసే అరవాలి అంటూ డిసైడ్ అయిందని . అప్పుడే తమ పేరు సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో హైలెట్ అవుతుందని తెలుసుకునిందని ..ఆ కారణంగానే కృతి ఇంత వైల్డ్ గా రియాక్ట్ అయింది అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఎటువంటి సపోర్ట్ లేని కృతిశెట్టి ఇంత ధైర్యంగా రిపోర్టర్స్ తో మాట్లాడటం సైతం షాక్ ఇస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news