Movies"ఉపాసన కడుపులో ఉన్న బిడ్డకు జపాన్ తో సంబంధం ఏంటో తెలుసా?"…...

“ఉపాసన కడుపులో ఉన్న బిడ్డకు జపాన్ తో సంబంధం ఏంటో తెలుసా?”… భార్య షాకింగ్ ప్రెగ్నెన్సీ సీక్రెట్ ని రివీల్ చేసిన చరణ్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెన్సీ న్యూస్ ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అమ్ముడు ప్రెగ్నెన్సీ దాల్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్గా ఆమె భర్త రామ్ చరణ్ – జి20 సమ్మిట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఉపాసన ప్రగ్నెన్సీ కి సంబంధించిన షాకింగ్ సీక్రెట్ ను రివిల్ చేశాడు రామ్ చరణ్ .

రామ్ చరణ్ స్టేజ్ పై మాట్లాడుతూ..” నాకు జపాన్తో ఎంతో విడదీయరాని సంబంధం ఉంది. జపాన్ దేశంలోనే నా భార్య ప్రెగ్నెన్సీ విషయం బయటపడ్డింది. మా లైఫ్లో జరిగిన మ్యాజిక్ మాకు ఇక్కడే తెలిసింది . నాకు యూరప్ అంటే చాలా చాలా ఇష్టం.. కానీ ఇప్పుడు జపాన్ దేశం కూడా నాకు ఎంతో ఫేవరెట్ గా మారిపోయింది . ఈ మూమెంట్ నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను . నా భార్య ఉపాసనకు ఏడవ నెల “..

“ఈ మ్యాజిక్ జరిగిందంతా ఇక్కడే ..” అంటూ సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చారు . అంతేకాదు జపాన్ దేశం ప్రజలు వారి సంస్కృతి నాకు ఎంతో ఇష్టం.. అని రాంచరణ్ చెప్పుకొచ్చాడు. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీం జపాన్ వెళ్లింది . ఉపాసన కూడా అతగాడితో వెళ్ళింది . ఈ మ్యాజిక్ అంతా జరిగింది అక్కడే అంటూ రాంచరణ్ చెప్పుకురావడంతో జనాలు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఉపాసన ప్రెగ్నెన్సీ విషయానికి సంబంధించి ఏ న్యూస్ అయినా సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతూ ఉండడం మెగా వారసుడు రాకకు ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అని ఇట్టే తెలిసిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news