Moviesఓరి మీ వేషాల్లో..పవిత్రకి నరేష్ ఎలా ప్రపోజ్ చేసాడో తెలుసా..? సార్...

ఓరి మీ వేషాల్లో..పవిత్రకి నరేష్ ఎలా ప్రపోజ్ చేసాడో తెలుసా..? సార్ మంచి రొమాంటిక్ ఫెలోనే..!!

సినిమా ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ నరేష్ – పవిత్ర లోకేష్ ల పేరు ఏ రేంజ్లో మారుమ్రోగి పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా “మళ్ళీ పెళ్లి” . ఈ సినిమా మే 26న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . తెలుగు కన్నడ భాషలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం నరేష్ – పవిత్ర లోకేష్ తెగ కష్టపడుతున్నారు . సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట తమ లవ్ స్టోరిని బయటపెట్టారు .

ఈ క్రమంలోనే నరేష్ మాట్లాడుతూ.. పవిత్రని చూసి ఎలా పడిపోయాడో..ఎలా ప్రపోజ్ చేసాడో వివరంగా చెప్పుకొచ్చాడు . ఎప్పుడో ఆలయం సినిమా సమయంలో ఒకసారి కలుసుకున్నారట. పవిత్రని నరేష్ ఆ సమయంలోనే అట్రాక్ట్ చేసిందట. పవిత్ర లోకేష్ తనతో ఏం మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు అలా చూసి మాట్లాడకపోయేసరికి పొగరేమో అనుకున్నాడట . చాలా లైట్ గా తీసుకున్నారట . ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ సినిమా సమయంలో మళ్ళీ కలుసుకున్నారట. ఆ టైంలో పవిత్ర గల గల మాట్లాడుతుంటే ..చూసి అట్రాక్ట్ అయిపోయాడట . నరేష్ అమ్మాయి బాగుంది ,,అందంగా ఉంది.. అంటూ పాజిటివ్ ఎనర్జీ కలిగిందట .

ఆ తర్వాత మరోసారి సమ్మోహనం సినిమా షూటింగ్లో కలుసుకున్నారట. అంతే కాదు సమ్మోహనం సినిమా షూటింగ్లో నీ స్మెల్ నచ్చింది అంటూ ఓపెన్ గా చెప్పకు వచ్చారట . ఆమె పర్ఫ్యూమ్ పేరు చెప్పిందని ..కానీ అది కాదు నీ స్మెల్ నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడట. ఆ తర్వాత మరో రోజు కిచెన్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమె హుందాతనం నచ్చిందని ..ఆ నడవడం చూసి అప్పుడే ఆ అమ్మాయి నా వంటింట్లో తిరిగితే బాగుండు అని అనుకున్నారట. అప్పటికే నా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ గా ఉండడంతో పవిత్రకు ఇంకా కనెక్ట్ అయిపోయాయని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పవిత్ర కి ఓ మెసేజ్ పెట్టాడట . కానీ రియాక్ట్ అవ్వలేదట.

దీంతోనే ఆమె పెద్ద జాదూది అంటూ ఫీల్ అయిపోయాడట . ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్ తీసుకొని మళ్ళీ బెంగళూరులో కలిసిందట . షూటింగ్ కోసం వచ్చాను మీట్ అవుదామా అంటే ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారట . ఫ్రెండ్షిప్ ఏర్పడింది . అయితే అప్పటివరకు అది ఫ్రెండ్షిప్ గానే ఉండిందని .. ఆ తర్వాత అనుకోకుండా సమ్మోహనం సినిమాలో మళ్ళీ కలిశారట . అప్పుడే వాళ్లకు లవ్ పుట్టిందని ..ఆమె నాకు రైట్ పర్సన్ అనిపించింది అని చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఈ విషయం ఆమె చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కాలేదు నా ఫ్రెండ్షిప్ పోతుందేమో అంటూ భయపడిపోయారట.

ఓ రోజు డిన్నర్ కి తీసుకెళ్ళి లవ్ ప్రపోజ్ చేసాడట. అంతా విని కారులో సైలెంట్ గా కూర్చుందట . హోటల్లో దిగిపోతున్న సమయంలో నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వలేదు అని అడగ్గా .. కీప్ లవింగ్ మీ అంటూ చెప్పకు వచ్చిందట . ఆ తర్వాత ఆ తర్వాత ఏమి పట్టనట్టు పవిత్ర దూరంగానే ఉండిందట . అయితే డిసెంబర్ 31 రోజున తాడోపేడో తేల్చేసుకుందామంటూ కేక్ బొకే తీసుకెళడట. ఇప్పుడైనా చెప్తావని అడగక అప్పుడు న్యూ ఇయర్ రోజు ఐ లవ్ యు అంటూ చెప్పకు వచ్చిందట . దీంతో సోషల్ మీడియాలో నరేష్ పవిత్ర లవ్ స్టోరీ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news