Moviesఇండియాలో 7వ రిచ్చెస్ట్‌మ్యాన్ బిచ్చ‌గాడు… హార్ట్ ట‌చ్చింగ్‌గా ' బిచ్చ‌గాడు 2...

ఇండియాలో 7వ రిచ్చెస్ట్‌మ్యాన్ బిచ్చ‌గాడు… హార్ట్ ట‌చ్చింగ్‌గా ‘ బిచ్చ‌గాడు 2 ‘ ట్రైల‌ర్ (వీడియో)

ఐదు ఆరు సంవత్సరాల క్రితం తమిళంతో పాటు తెలుగు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది బిచ్చగాడు సినిమా. మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ అంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లు కొల్లగొట్టింది. విచిత్రం ఏంటంటే ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి ఏకంగా 55 కేంద్రాలకు పైగా వంద రోజులు పూర్తి చేసుకుంది. మరెన్నో కేంద్రాల్లో అర్థశ‌త‌ దినోత్సవం జరుపుకుంది

ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేసిన చదల‌వాడ శ్రీనివాసరావుకు కోట్లాది రూపాయల లాభాలు వచ్చాయి. ఎప్పుడో విక్టరీ వెంకటేష్ తో శీను లాంటి సినిమా తెరకెక్కించిన ఐవి. శశి చాలా ఏళ్ల తర్వాత బిచ్చగాడుతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఆరేళ్ల త‌ర్వాత అదే బిచ్చ‌గాడు సినిమాకు సీక్వెల్‌గా బిచ్చ‌గాడు 2 తెర‌కెక్కించారు.

మే 19న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్ వ‌దిలారు. ట్రైల‌ర్ మాంచి ఎమోష‌న‌ల్ సీన్ల‌తో పాటు గ్రాండ్ విజువ‌ల్స్‌తో ఉంది. గ‌త సినిమాలో చూపించ‌ని విధంగా ఎమోష‌న‌ల్ సీన్లు నేచురాల్టీకి ద‌గ్గ‌ర‌గా చూపించారు. ఇండియాలోనే సెవెన్త్ రిచ్చెస్ట్ బిజినెస్‌మ్యాన్‌గా ఉన్న హీరోకు బిచ్చ‌గాడి పాత్ర‌కు లింక్ ఏంటి ? అస‌లు ఈ క‌థ‌లో పెద్దోళ్ల న‌ల్ల‌ధ‌నంకు హీరోకు ఉన్న లింక్ ఏంట‌న్న‌ది కూడా ట్విస్టింగ్‌గా చూపించిన‌ట్టు ఉంది.

ఇక బిచ్చ‌గాడు అనే ట్రాక్ కూడా అప్ప‌టి సినిమా ట్రీట్ గుర్తు చేసింది. అయితే బిచ్చ‌గాడులో ఉన్న అమ్మ సెంటిమెంట్ ఈ సినిమాలో ఉందా ? లేదా ? అన్న‌ది క్లారిటీ లేదు. అయితే ట్రైల‌ర్ మాత్రం చాలా ప్రామీసింగ్‌గా ఉందనిపించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news